Kerala : వణుకు పుట్టిస్తున్న’నిఫా’.. మరో 11 మందిలో లక్షణాలు

వైరస్‌ల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా మరో 11 మందికి నిఫా లక్షణాలు గుర్తించారు.

Kerala : వణుకు పుట్టిస్తున్న’నిఫా’.. మరో 11 మందిలో లక్షణాలు

Kerala

Nipah Virus : కేరళలో ఓ వైపు కరోనా మరోవైపు నిఫా జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైరస్‌ల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా మరో 11 మందికి నిఫా లక్షణాలు గుర్తించారు. నిఫా వైరస్‌తో మృతి చెందిన 12 ఏళ్ల బాలుడితో ఒక్కసారిగా కలవరం మొదలైంది. బాలుడికి సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, మొత్తం 251 మందిని ట్రేస్ చేశారు. వారందరికీ పరీక్షలు చేశారు. ఇందులో 129 మంది నర్సులు, వైద్యులు కాగా.. మిగతావారు సన్నిహితులు.

Read More : Nandamuri Mokshanga: అభిమానుల ఎదురుచూపులు.. వారసుడి ఎంట్రీ ఎప్పుడు?

వారిలో అతడికి అత్యంత దగ్గరగా ఉన్న 38 మందిని కోజికోడ్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. తాజాగా11 మందికి నిఫా లక్షణాలు గుర్తించడంతో మరింత అప్రమత్తమయ్యారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. వారిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 8 మంది శాంపిళ్ల రిపోర్టులు త్వరలో వస్తాయని తెలిపారు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్. బాలుడి తల్లి జ్వరంతో బాధపడుతున్నారని మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు వీణా జార్జ్‌.

Read More : Ikkat Shaluvas : హస్తినలో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులకు ‘ఇక్కత్ వస్త్రాల’తో సన్మానం

వారి ఇంట్లో ఉన్న రెండు మేకల శాంపిళ్లు తీసుకుని పరీక్షిస్తున్నట్టు వెల్లడించారు అధికారులు. కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలో నిఫా బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు. కేరళకు చేరుకున్న కేంద్ర నిపుణుల బృందం బాలుడి ఇంటిని, ఆ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించింది. అతడికి నిఫా వైరస్‌ రాంబుటాన్‌ పండు ద్వారానే సోకి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. దీంతో ఇంటికి సమీపంలో ఉన్న ఆ పండ్లను కూడా సేకరించి NIVకి పంపారు.దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్‌ బారినపడిన 17 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి విజృంభణతో జనం టెన్షన్ పడుతున్నారు.