Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. రూ.10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్

నాగ్‌పూర్‌లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది. జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంతా పేరుతో ఒక వ్యక్తి గడ్కరీ ఆఫీస్‌కు కాల్ చేశాడు. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి హాని తప్పదని బెదిరించారు.

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. రూ.10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాను అడిగినట్లు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి హాని తప్పదని కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. నాగ్‌పూర్‌లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది.

Rafael Nadal: టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్.. 2005 తర్వాత ఇదే తొలిసారి

జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంతా పేరుతో ఒక వ్యక్తి గడ్కరీ ఆఫీస్‌కు కాల్ చేశాడు. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి హాని తప్పదని బెదిరించారు. ఈ కాల్స్ వచ్చిన వెంటనే గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గడ్కరీ ఆఫీసుకు చేరుకుని విచారణ ప్రారంభించారు. జయేష్ పేరుతో ఈ కాల్స్ చేసినట్లు డీసీపీ రాహుల్ తెలిపారు. బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్ మంగళూరులో ఒక మహిళ పేరుతో ఉన్నట్లు, ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆమె ఆ ఫోన్ కాల్స్ చేయలేదని, ఎవరు చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.

కాగా, గత జనవరిలో కూడా ఇదే నెంబర్ నుంచి గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులు చెప్పారు. తాజాగా గడ్కరీని బెదిరించినప్పటికీ, ప్రాణానికి హాని తలపెడతామంటూ హెచ్చరించలేదని పోలీసులు తెలిపారు. గడ్కరీ భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.