Minister Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కలిగిస్తుంది

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కల్గిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. సభా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కలిగిస్తుంది

Kishan Reddy

Minister Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కల్గిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. సభా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని అన్నారు. బీజేపీ కార్యాకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ హార్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని అన్నారు.

PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి

ప్రజల ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఎనిమిదేళ్ళుగా మోదీ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని, కార్యవర్గ సమావేశాలు ప్రజల‌ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మోదీ రాకకోసం తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలు ఒకేసారి రావటం అరుదైన సంఘటన అని కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మోదీ సభ ఉంటోందన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షాలు ప్రత్యేక దృష్టి సారించారని, మరో ఏడాదిలో తెలంగాణలో రామ రాజ్యం రావటం ఖాయమని తెలిపారు.

Minister Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు

టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, హార్డింగ్స్, ఫ్లెక్సీల విషయంలో టీఆర్ఎస్ ది చిల్లర రాజకీయమంటూ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పోటీ చేయనున్నాయని, కాంగ్రెస్ కు బీ పార్టీగా టీఆర్ఎస్, ఎంఐఎంలు వ్యవహరిస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు. కుటుంబ పార్టీలు కనుమరుగవటం‌ ఖాయమని, పుత్ర వాత్సల్యం వలన శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్ కు పడుతుందని కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ రాష్ట్రపతి అవుతుంటే టీఆర్ఎస్ నాయకత్వం ఓర్వలేకపోతోందని, ఆదివాసీని రాష్ట్రపతిని చేస్తోన్న ఘనత 70ఏళ్ళల్లో బీజేపీకి దక్కుతుందని లక్ష్మణ్ అన్నారు.