COVID-19: క‌రోనాను జ‌యించిన‌ట్లు ప్ర‌క‌టించ‌నున్న ఉత్త‌ర‌కొరియా

ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల‌నూ రెండేళ్ళ క్రిత‌మే క‌రోనా చుట్టుముట్టినా ఉత్త‌ర‌కొరియాలోకి ఆ వైర‌స్ ప్ర‌వేశించి కేవ‌లం 40 రోజులు మాత్ర‌మే అవుతోంది.

COVID-19: క‌రోనాను జ‌యించిన‌ట్లు ప్ర‌క‌టించ‌నున్న ఉత్త‌ర‌కొరియా

Kim Jong Un

COVID-19: ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల‌నూ రెండేళ్ళ క్రిత‌మే క‌రోనా చుట్టుముట్టినా ఉత్త‌ర‌కొరియాలోకి ఆ వైర‌స్ ప్ర‌వేశించి కేవ‌లం 40 రోజులు మాత్ర‌మే అవుతోంది. అయితే, అప్పుడే క‌రోనాను జ‌యించేశామ‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డానికి ఉత్త‌ర‌కొరియా సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఉత్త‌ర‌కొరియాలో మొద‌టి క‌రోనా కేసు న‌మోదైన‌ప్ప‌టి నుంచి ఎన్నో ఆంక్ష‌లు విధించారు. ఆ దేశ అధ్య‌క్షుడు కింగ్ జాంగ్ ఉన్ కూడా మాస్కు పెట్టుకునే క‌న‌ప‌డ్డాడు. వ్యాక్సిన్‌కు కూడా ఉత్త‌ర‌కొరియా అనుమ‌తి ఇవ్వ‌లేదు.

International Yoga Day: తాజ్‌ మ‌హ‌ల్‌, ఆగ్రా కోట స‌హా స్మార‌క చిహ్నాల్లో నేడు ప్ర‌వేశం ఉచితం

ఉత్త‌ర‌కొరియాలో ఆరోగ్య వ్య‌వ‌స్థ కూడా బాగోదు. దీంతో ఆ దేశంలో క‌రోనా కేసులు ఇప్ప‌ట్లో త‌గ్గ‌బోవ‌ని, భారీ న‌ష్టం జ‌రుగుతుంద‌ని ప్ర‌పంచ దేశాలు భావించాయి. ప్ర‌జ‌లు తీవ్ర ఆరోగ్య‌, ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటార‌ని నిపుణులు అభిప్రాయప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ ఇంత త్వ‌ర‌గా ఉత్త‌ర‌కొరియా ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే పూర్తిగా విముక్తి కాబోతున్నార‌ని అక్క‌డి మీడియా పేర్కొంది. ఉత్త‌ర‌కొరియా త్వ‌ర‌లోనే క‌రోనాను జ‌యించిన‌ట్లు ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని ద‌క్షిణ కొరియా మీడియా కూడా తెలిపింది.