Movie Tickets : తెలంగాణాలో పెరుగుతున్న సినిమా టికెట్ రేట్లు.. CS సోమేశ్‌కుమార్‌కి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త..

ఆంధ్రాలో టికెట్ ధరలు ఓ మాదిరిగా ఉన్నా తెలంగాణాలో మాత్రం ప్రతి సినిమాకి, ఆఖరికి రీమేక్ సినిమాలకి కూడా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఆ జీవోలని సవాల్ చేస్తూ.........

Movie Tickets : తెలంగాణాలో పెరుగుతున్న సినిమా టికెట్ రేట్లు.. CS సోమేశ్‌కుమార్‌కి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త..

Somesh

CS Somesh Kumar :  ఇటీవల తెలంగాణాలో సినిమా టికెట్ రేట్లు అడ్డగోలుగా పెరిగిన సంగతి తెలిసిందే. మామూలు థియేటర్లలో 50, 100 ఉండాల్సిన టికెట్ రేటు 150, 250 వరకు వెళ్ళింది. ఇక మాల్స్ లో 150 నుంచి 250 ఉండాల్సిన టికెట్ 350 నుంచి 500 వరకు పెరిగింది. దీంతో సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. కరోనా వల్ల ఆగిపోయిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతుండటంతో వారానికి ఒక పెద్ద సినిమా అయినా ఉంటుంది. దీంతో వీకెండ్ లో సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాలి అనుకునే వారికి పెద్ద భారమే ఎదురవుతుంది. స్టార్ హీరో సినిమా అయితే అభిమానులకి మరింత భారమే.

 

ఇక థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దీంతో ఒక ఫ్యామిలీ మాల్ లో ఒక్కసారి సినిమాకి వెళ్లాలంటే 2000 నుంచి 3000 ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ఆ ఖర్చుతో సగం నెల బతకొచ్చు. మాములు థియేటర్ కి వెళ్లినా 1000 రూపాయలు అవుతుంది. అటు సినిమా వాళ్ళు కరోనా వల్ల నష్టపోయాము అందుకే టికెట్ రేట్లు పెంచండి అని ప్రభుత్వాలని వేడుకొంటున్నారు, మరి కొంతమంది అత్యాశతో సినిమాకి పెట్టిన బడ్జెట్ మొదటి మూడు రోజుల్లోనే రావాలని ఆశిస్తున్నారు.

Oscar Awards : వచ్చే ఏడాదికి రెడీ అయిపోయిన ఆస్కార్.. డేట్స్ రిలీజ్ చేసిన కమిటీ..

ఆంధ్రాలో టికెట్ ధరలు ఓ మాదిరిగా ఉన్నా తెలంగాణాలో మాత్రం ప్రతి సినిమాకి, ఆఖరికి రీమేక్ సినిమాలకి కూడా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. దీన్ని ప్రశ్నించే వాళ్లే కరువైపోయారు. సోషల్ మీడియాలో ఇప్పటికే తెలంగాణ సినిమా టికెట్ రేట్ల మీద విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని ప్రభుత్వం జీవో జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ జీవోలని సవాల్ చేస్తూ సామాజిక సేవా కార్యకర్త, తీన్మార్ మల్లన్న టీం జనగాం జిల్లా కో కన్వీనర్ తుప్పతి శ్రీనివాస్ హైదరాబాద్ లోని లోకాయుక్త కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ పరిశీలించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కి నోటీసులు జారీ చేసింది. జులై నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు లోకాయుక్త కోర్టుకి హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.