10th Paper Leak : 10th పేపర్ లీకేజ్ కేసులో ఈటెల రాజేందర్‌కు నోటీసులు ..

10th Paper Leak  : 10th  పేపర్ లీకేజ్ కేసులో ఈటెల రాజేందర్‌కు నోటీసులు ..

10th Paper Leak Case..etela rajender

10 th Paper Leak  : 10 th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మరో బీజేపీ నేతల అయిన ఈటెలకు కూడా నోటీసులు జారీ చేశారు. కమలాపూర్ లో 10 th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ పై ఈటెల స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు. దీని కోసం నోటీసులు జారీ చేశారు. ప్రశాంత్ ఈటెలకు కూడా పేపర్లు పంపించాడని భావించిన పోలీసులు ఈటెలకు నోటీసులిచ్చారు.

BJPLeaks : బండి సంజయ్ అరెస్ట్.. ట్రెండింగ్‌లో #BJPLeaks

10 పేపర్ లీకేజ్ కు హుజురాబాద్ నియోజకవర్గ నే ఎందుకు ఎంచుకున్నారన్న దానిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈటెల రాజేందర్ తో పాటు ఆయన పోలీసులు పీఏలకు కూడా నోటీసులు ఇవ్వనున్నారు. బండి సంజయ్ తో పాటు ప్రశాంత్ ను వారం రోజులపాటు కస్టడీ ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటీషన్ వేయనున్నారు. వీరిద్దరిని విచారిస్తే మరింత సమాచారం బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

తెలంగాణలో టెన్త్ ఎక్జామ్ పేపర్ లీక్ వ్యవహారంలో పెను దుమారాన్ని రేపుతోంది. బీజేపీపై తీవ్రంగా మండిపడే బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 th Paper Leak కేసులో బీజేపీ నేతల హస్తం ఉందనే విషయం ప్లస్ గా మారింది. ఇక అరెస్టులతో పోలీసులు బిజీ బిజీగా ఉంటే..బీఆఎస్ నేతలు అడ్డంగా బుక్ అయిన బీజేపీ నేతలపై విమర్శలు సంధించే పనిలో బిజీగా ఉన్నారు.బుధవారం బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ అరెస్ట్ తరువాత ఈటెలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.

CP Ranganath: అందుకే పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్.. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందో చెప్పడం లేదు: సీపీ రంగనాథ్

ఈటెలకు ప్రశాంత్ పేపర్ పంపించటంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పేపర్‌ లీక్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అసలేం జరిగింది..? దీని వెనుక ఇంకా ఎవరున్నారు..?అనే పలు కీలక కోణాల్లో పోలీసులు దృష్టిపెట్టారు.ఈ వివరాలన్నీ తెలియాలంటే బీజేపీ నేతలను పూర్తి స్థాయిలో విచారించాలని భావిస్తున్నారు. ఇప్పటికే బండి అరెస్ట్ కాగా ఇక ఈటల రాజేందర్ అతని పీఏకు నోటీసులు ఇవ్వనున్నారు.