NTR: కొరటాలకు ఎన్టీఆర్ ఝలక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ విక్టరీని ఎంజాయ్ చేస్తూనే, తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో...

NTR: కొరటాలకు ఎన్టీఆర్ ఝలక్..?

Ntr Koratala Siva Movie To Take More Time

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ విక్టరీని ఎంజాయ్ చేస్తూనే, తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన తారక్, తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

NTR: టెన్షన్‌లో ఎన్టీఆర్.. ఒకటి కాదు రెండు కారణాలు!

అయితే కొరటాలకు తారక్ ఇప్పుడు ఓ చిన్న ఝలక్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా బలంగానే ఉందట. కొరటాల తెరకెక్కించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో తారక్ తన నెక్ట్స్ మూవీ కోసం కొరటాలను మరింత సమయం తీసుకోవాల్సిందిగా కోరాడట. అంతేగాక ఈ సమయంలో స్క్రిప్టుపై మరోసారి వర్క్ చేయాల్సిందిగా కొరటాలకు తారక్ సూచించాడట.

NTR 30 : ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అప్డేట్ అప్పుడే.. లీక్ చేసిన కొరటాల శివ..

ఏదేమైనా ఆచార్య చిత్రంతో కెరీర్‌లో తొలిసారి ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్న కొరటాలను నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక తారక్ కోసం ఆయన మరింత జాగ్రత్తగా సినిమా తీయాల్సిన బాధ్యత నెలకొంది. దీంతో ఎన్టీఆర్ ఎలాంటి తప్పటడుగు పడకుండా ఉండేందుకే కొరటాలకు మరికొంత సమయం ఇచ్చి, స్క్రిప్టుపై పూర్తి దృష్టిని పెట్టాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఎన్టీఆర్ లేదా కొరటాల దీనిపై స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.