NTR: టెన్షన్‌లో ఎన్టీఆర్.. ఒకటి కాదు రెండు కారణాలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించగా...

NTR: టెన్షన్‌లో ఎన్టీఆర్.. ఒకటి కాదు రెండు కారణాలు!

Ntr In Tension Due To Two Reasons

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా కలిసి నటించాడు. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం తండోపతండాలుగా థియటేర్లకు క్యూ కట్టారు. పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రాగా, ఇందులో తారక్ కొమురం భీం పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామారాజు పాత్రలో నటించాడు. వీరిద్దరినీ వెండితెరపై చూసేందుకు అభిమానులు తహతహలాడారు.

NTR: ఎన్టీఆర్ కోసం అదిరిపోయే కథ రెడీ – కొరటాల

మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడం, బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ జాబితాలో చేరిపోవడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కూడా తమ నెక్ట్స్ చిత్రాలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. చరణ్ ఇప్పటికే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే తారక్ మాత్రం తన నెక్ట్స్ మూవీని ఆచార్య డైరెక్టర్ కొరటాల శివతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కానీ ఇప్పుడు తారక్‌ను రెండు విషయాలు టెన్షన్ పెడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సాధారణంగా టాలీవుడ్‌లో ఓ సెంటిమెంట్ బలంగా పాతుకుపోయింది. రాజమౌళి చేసే సినిమాలు అన్నీ హిట్లుగా ఉంటే, ఆయన సినిమాల్లో నటించే హీరోలకు మాత్రం తరువాత వరుస ఫెయిల్యూర్లు పడుతుంటాయి. ఇప్పుడు చరణ్‌కు కూడా ఇదే ఎదురయ్యే సూచనలను కనిపిస్తున్నాయి. ఆచార్యకు టాక్ మంచిగానే వస్తున్నా, వీకెండ్ కూడా కలిసి వస్తుండటంతో ఆచార్య మూడు రోజుల పాటు ఎలాంటి ఢోకా లేకుండా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతుంది. అయితే అసలు సమస్య మాత్రం సోమవారం నుండి మొదలువుతుంది. వీక్‌డేస్ కావడంతో ఆచార్యకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కుతుందా లేదా అనేది సందేహంగా మారిందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!

ఇక దర్శకుడు కొరటాల కూడా ఆయన స్థాయికి తగ్గ కథను రెడీ చేయలేకపోయాడనే వాదన ఇండస్ట్రీలో, ఫ్యాన్స్‌లో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు అంశాలు కూడా తారక్‌ను టెన్షన్ పెడుతున్నాయట. అసలే ఆర్ఆర్ఆర్ కోసం చాలా గ్యాప్ తీసుకున్న తాను, ఇప్పుడు కొరటాల శివ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట. మరి తారక్ ఈ రెండు టెన్షన్‌ల నుండి ఎప్పుడు బయటపడతాడో చూడాలి.