NTR: ఎన్టీఆర్ కోసం అదిరిపోయే కథ రెడీ – కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా...

NTR: ఎన్టీఆర్ కోసం అదిరిపోయే కథ రెడీ – కొరటాల

Ntr Next Movie To Have Powerful Story Says Koratala Siva

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసి ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తన నెక్ట్స్ మూవీని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు తారక్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

NTR: ఎన్టీఆర్‌కు హీరోయిన్ దొరికేసిందా..?

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా కోసం కొరటాల ఎలాంటి కథను పట్టుకొస్తున్నాడా అనే సందేహం అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. తాజాగా ఈ ప్రశ్నకు కొరటాల శివ సమాధానం ఇచ్చాడు. కొరటాల తెరకెక్కించిన మెగా మూవీ ‘ఆచార్య’ రిలీజ్‌కు రెడీ కావడంతో, ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.

NTR: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన తారక్!

ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ కొరటాల తన నెక్ట్స్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తారక్‌తో తాను చేయబోయే సినిమా సరికొత్తగా ఉండబోతుందని.. ఇదొక పక్కా మాస్ డ్రామా మూవీగా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని కొరటాల అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఇప్పటివరకు తారక్ సినిమాల్లో లేని విధంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఇది అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన అన్నారు. ఇలా ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ గురించి అప్పుడే క్లూ ఇచ్చేసిన కొరటాల, ఈ సినిమాపై అంచనాలు పెంచేశారని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.