NTR: ఎన్టీఆర్‌కు హీరోయిన్ దొరికేసిందా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి...

NTR: ఎన్టీఆర్‌కు హీరోయిన్ దొరికేసిందా..?

Rashmika Mandanna In Talks For Ntr Next Movie

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాలో తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

NTR: తారక్‌తో చేయాలంటూ తన కోరికను బయటపెట్టిన సీనియర్ హీరోయిన్!

ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కానీ.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. గతంలో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఆమెకు ఇటీవల పెళ్లి కావడంతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. దీంతో ఈ సినిమాలో ఆలియా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

NTR: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన తారక్!

ఈ క్రమంలోనే కన్నడ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు చిత్ర వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవాలని చూసినా, ఆమె ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాలో రష్మికను సెలెక్ట్ చేశారట చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా కథ విన్న వెంటనే రష్మిక కూడా ఈ సినిమాలో నటించేందుకు సై అన్నట్లుగా చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే తారక్ సినిమాకు హీరోయిన్ దొరికేసిందా అనే ప్రశ్నకు.. చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించే వరకు మనం వెయిట్ చేయక తప్పదు.