RRR : జపాన్ లో RRR క్రేజ్ తగ్గేదేలే అంటుంది.. టైటానిక్ రికార్డు!

జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద RRR దూకుడు అసలు తగ్గేదేలే అంటుంది. ఇలాగే కంటిన్యూ అయ్యితే టైటానిక్ రికార్డు..

RRR : జపాన్ లో RRR క్రేజ్ తగ్గేదేలే అంటుంది.. టైటానిక్ రికార్డు!

NTR Ram Charan RRR craze at japan box office surpass titanic

RRR : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి క్రేజ్ ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ స్వతంత్ర సమర యోధులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. బిఫోర్ ఇండిపెండెన్స్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒకర్ని ఆకట్టుకుంది. జపాన్ మరియు అమెరికా దేశాల్లో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా జపాన్ లో ఈ చిత్రానికి ప్రజాధారణ పెరుగుతూ పోతుంది తప్పా, అసలు తగ్గడం లేదు.

Gopichand : మీ తండ్రిని చూసి అవకాశం ఇచ్చా.. నువ్వేం పీకావ్.. గోపీచంద్ పై తేజ కామెంట్స్!

ఎన్టీఆర్ అండ్ చరణ్ కి జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు హీరోలు నటించిన మునపటి సినిమాలు జపాన్ లో విడుదలయ్యి అభిమానులను సంపాదించి పెట్టింది. దీంతో RRR బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ బజ్ తోనే రిలీజ్ అయ్యింది. ఇక సినిమా అదిరిపోవడంతో జాపనీస్ థియేటర్ల వద్ద క్యూ కట్టారు. జపాన్ వద్ద 24 ఏళ్ళ పాటు ఉన్న రజినీకాంత్ రికార్డుని RRR బ్రేక్ చేసి సంచలనం సృష్టించడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్స్ అందుకొని ఆ మార్క్ ని క్రాస్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

జపాన్ RRR రిలీజ్ అయ్యి 186 రోజులు అవుతుంది. అయినా బాక్స్ ఆఫీస్ వద్ద క్రేజ్ మాత్రం తగ్గేదేలే అంటుంది. ఈ వారం ఆన్ లైన్ బుకింగ్స్ లో దూకుడు చూపించి టాప్ 10 లోకి మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ దూకుడు చూస్తుంటే జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ మల్టీప్లేయర్ గా నిలిచిన టైటానిక్ ని వెనక్కి నెట్టి RRR స్థానం దక్కించుకునేలా ఉంది. మరి జక్కన చెక్కిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే.