Odisha Artist : ఆహార ధాన్యాలతో 8 ఫీట్ల మోదీ చిత్రం..ఒడిశా కళాకారిణి ప్రతిభ

ఓ కళాకారిణి మాత్రం వినూత్న ప్రయత్నం చేసింది. ఆహార ధాన్యాలతో 8 అడుగుల పొడవున్న మోదీ చిత్రపటాన్ని తయారు చేశారు.

Odisha Artist : ఆహార ధాన్యాలతో 8 ఫీట్ల మోదీ చిత్రం..ఒడిశా కళాకారిణి ప్రతిభ

Modi

Updated On : September 18, 2021 / 10:19 AM IST

8-Foot-Long Portrait Of PM Modi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 71వ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ నేతలు భారీ సైజు కేకులు కట్ చేశారు. పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే..ఓ కళాకారిణి మాత్రం వినూత్న ప్రయత్నం చేసింది. ఆహార ధాన్యాలతో 8 అడుగుల పొడవున్న మోదీ చిత్రపటాన్ని తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారత్ వ్యవసాధారిత దేశం కావడంతో…ఈ చిత్రాన్ని ధాన్యాలతో తయారు చేయడం జరిగిందని, ఆయనకు అంకితమిస్తున్నట్ల తెలిపారు.

Read More : Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

భువనేశ్వర్ కు చెందిన ప్రియాంక స0హానీ ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రంలో గుండె దగ్గర భారతదేశ పటాన్ని గీశారు. ఎనిమిది అడుగుల పొడవు, నాలుగు అడవుల వెడల్పుగా ఉంది. ఈ చిత్రం గీయడానికి ఐదు నుంచి ఆరు రకాల ధాన్యాలను ఉపయోగించారు. ఇందులో బియ్యం, పప్పు దినుసులున్నాయి. తాను ఒక చిన్న కళాకారిణినని, ఈ ఫొటోను రూపొదించడం ఒక సవాల్ అన్నారు. ఈ చిత్రాన్ని గీయడానికి సుమారు 25 గంటల సమయం పట్టిందని తెలిపారు.

Read More : Petrol Rate : పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడితో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. మొత్తం 20 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.