Omicron Variant: డబుల్ సెంచరీకి మించి ఒమిక్రాన్ కేసులు.. మూడోస్థానంలో తెలంగాణ

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చాపకింద నీరులా కనిపించుకుండానే పెరిగిపోతుంది. బుధవారం నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 213 కి చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి.

Omicron Variant: డబుల్ సెంచరీకి మించి ఒమిక్రాన్ కేసులు.. మూడోస్థానంలో తెలంగాణ

Omicron (2)

Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చాపకింద నీరులా కనిపించుకుండానే పెరిగిపోతుంది. బుధవారం నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 213 కి చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

అత్యధికంగా మహారాష్ట్రలో 57, ఢిల్లీలో 54, తెలంగాణలో 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి వరుసలో రాజస్థాన్ 18, కర్ణాటక 19, కేరళ 15, గుజరాత్ 14, జమ్మూకాశ్మీర్ 3, ఉత్తరప్రదేశ్ 2, చండిఘడ్ 1, తమిళనాడు 1, పశ్చిమ బెంగాల్ 1, ఏపీలో 1, లద్దాఖ్ 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు.

ఒమిక్రాన్ తో బాధపడి 90 మంది రికవరీ అయ్యారు. ఇదిలా ఉంటే గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 6వేల 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 318 మరణాలు నమోదయ్యాయి.

……………………………… : ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం

భారత్‌లో కరోనా యక్టీవ్ కేసులు 575 రోజుల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం దేశంలో 78వేల 190 యాక్టివ్ కేసులున్నాయని తెలుస్తుంది. దేశంలో ఇప్పటివరకు 3కోట్ల 47లక్షల 58వేల 481 కేసులు నమోదయ్యయాని అందులో కోవిడ్ కారణంగా 4లక్షల 78వేల 325 మరణాలు సంభవించాయని తెలుస్తోంది.

కరోనా రికవరీ రేటు 98.40 శాతంగా ఉండగా.. మంగళవారం ఒక్కరోజే కరోనా నుంచి 6906 మంది కోలుకున్నారు. మార్చి 2020 రికవరీ కేసులు భారీ పెరిగి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3కోట్ల 42లక్షల వెయ్యి 966 కు చేరింది.

…………………………: విలీనం దిశగా జీ-సోనీలకు అప్రూవల్