Omicron Cases in India : భారత్‌లో 4కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కొత్త ఒమిక్రాన్ కేసు నమోదైంది.

Omicron Cases in India : భారత్‌లో 4కి చేరిన ఒమిక్రాన్ కేసులు

Omicron Cases In India Fourth Omicron Case Detected In India

Omicron cases in India : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారతదేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కొత్త ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈరోజు శనివారం (డిసెంబర్ 4)న దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన కళ్యాణ్-డోంబివిలీకి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి #Omicron వేరియంట్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మహారాష్ట్రలో వేరియంట్ మొదటి కేసు కాగా.. దేశంలో మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది. 33 ఏళ్ల ప్రయాణికుడు నవంబర్ 24న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి దుబాయ్ & ఢిల్లీ మీదుగా ముంబైకి చేరుకున్నాడు. అతడు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోలేదు. 12మంది హై-రిస్క్ కాంటాక్ట్‌లలో ఒకరిగా గుర్తించారు. అలాగే తక్కువ-రిస్క్ కాంటాక్ట్‌లలో 23మందిని కనుగొన్నారు. వారందరికీ #COVID19 నెగెటివ్‌గా తేలిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బాధితులందరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా.. రిపోర్టులు వస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉంది.

ఢిల్లీ-ముంబై విమానం నుంచి వీరితో వచ్చిన ప్రయాణీకులలో 25 మందికి కూడా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మరిన్ని కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అంతకుముందు జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామానగర్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా నిర్దారణ అయింది. బెంగళూరులో (Bengaluru) రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.