Omicron : తెలంగాణలో ఒమిక్రాన్..హైదరాబాద్‌‌లో రెండు కేసులు

అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు...

Omicron : తెలంగాణలో ఒమిక్రాన్..హైదరాబాద్‌‌లో రెండు కేసులు

Omicron New 11zon

Omicron In Hyderabad : తెలంగాణలో ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చేసింది. హైదరాబాద్ లో ఏకంగా రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం మీడియాకు డీహెచ్ తెలిపారు. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించడం జరిగిందని వెల్లడించారు.

Read More : Kusuma Farming: కుసుమ సాగు.. తక్కువ ఖర్చుతో మంచి లాభాలు

కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు, జీనోమ్ సెక్వెన్సింగ్ లో 2021, డిసెంబర్ 14వ తేదీ మంగళవారం రాత్ర కన్ఫామ్ అయ్యిందని, 12వ తేదీన సొమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడం జరిగివందన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఆ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ కూడా టోలిచౌకి ఏరియాకు చెందిన వారన్నారు.

Read More : AP govt on ticket rates: హైకోర్టు తీర్పుపై.. అప్పీల్‌కు వెళ్లనున్న ఏపీ ప్రభుత్వం

వీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వారి వివరాలను సేకరించడం జరుగుతోందని, మరో ఏడేళ్ల బాలుడికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకిందన్నారు. కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల యువతికి కూడా వైరస్ సోకినట్లు గుర్తించడం జరిగిందన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఆ యువతికి కూడా ఒమిక్రాన్ గా నిర్ధారించామన్నారు. బాధితులకు టిమ్స్ లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు..

Read More : Skin Bank: దేశంలో మూడో స్కిన్ బ్యాంక్

ప్రపంచాన్ని ఒమిక్రాన్ గజగజలాడిస్తోంది. పలు దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండడంతో మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. భారతదేశంలోకి ప్రవేశించదని అనుకున్నా..ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చేసింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు రికార్డవుతున్నాయి. ఏపీలో నమోదైనా..అతనికి మళ్లీ టెస్ట్ చేస్తే.. నెగటివ్‌ వచ్చింది. అంటే.. ప్రస్తుతానికి ఏపీలో ఒమిక్రాన్ కేసులు లేనట్టేనంటున్నారు. మరోవైపు…ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read More : Bird Flu In Kerala : కొట్టాయంలో బర్డ్ ఫ్లూ..వేలాది బాతులు, కోళ్లను చంపి తగలబెట్టేందుకు బృందాలు

రానున్న రోజుల్లో కోవిడ్ కేసులు పెరుగుతాయన్న అంచనాతో.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కోవిడ్ బెడ్స్‌ని 55 వేల 442కు పెంచారు. చాలా మందికి ఆస్పత్రుల్లో చికిత్స అవసరమయ్యే పరిస్థితి లేకపోయినప్పటికీ.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు ఆస్పత్రుల్లో చేరే అవకాశముందని చెబుతున్నారు. మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. మహారాష్ట్రలో ఒమిక్రాన్ సోకిన కొంతమంది వారు కోలుకున్నారు. అయినప్పటికీ.. ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. దేశంలో ఒమిక్రాన్ అనుమానితుల సంఖ్య పెరుగుతోంది.