Omicron : ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ – సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

ఒమిక్రాన్ నుంచి కోలుకొనేందుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషణ్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పూర్తిస్థాయిలో భౌతిక విచారణ చేపట్టాలని కోరిన...

Omicron : ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ – సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Cji Nv Ramana

Omicron Silent Killer CJI NV Ramana : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వైరస్ ఇంకా వ్యాపిస్తుండగానే కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయి. అందులో ఒమిక్రాన్ ఒకటి. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే.. కోలుకున్న తర్వాత పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇదే విషయాన్ని సీజేఐ ఎన్వీ రమణ కూడా ప్రస్తావించారు. తాన ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. గత 25 రోజులుగా ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

Read More : డెల్టా, ఒమిక్రాన్ కలిస్తే డెల్టాక్రాన్.. ఇదో కొవిడ్ స్ట్రెయిన్..!

ఒమిక్రాన్ నుంచి కోలుకొనేందుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషణ్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పూర్తిస్థాయిలో భౌతిక విచారణ చేపట్టాలని కోరిన సందర్భంలో ఒమిక్రాన్ వేరియంట్ గురించి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కరోనా ఫస్ట్ వేవ్​లో తాను నాలుగు రోజుల్లోనే కోలుకున్నట్లు, కానీ ఇప్పుడు మాత్రం 25 రోజులు అవుతున్నా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నట్లు తెలిపారు. ప్రజలు త్వరగానే కొలుకుంటున్నారని న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు.

Read More : Coronavirus:ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్.. కనుక్కోవడం చాలా కష్టం.. టెస్ట్‌లో నెగెటివ్ రావచ్చు

గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ప్రజలను భయపెడుతోంది. అయితే ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. వైరస్ తగ్గుముఖం పడుతుండడం, పాజిటివ్ కేసులు గణనీయంగా తక్కువవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 15,102 కేసులు, 278 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,64,522 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.38 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 1.28 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 4,28,67,031 కేసులు, 5,12,622 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.42 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. మంగళవారం కరోనా నుంచి 31,377 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,21,89,887 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read More : Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..

మరోవైపు.. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. అలాగే… టెస్టుల సంఖ్య కూడా పెంచుతున్నారు. భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు 76.24 కోట్లు దాటాయని ఐసీఎంఆర్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 11,83,438 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76,24,14,018 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3298 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1422 ప్రభుత్వ లాబ్స్,1876 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.