Varun Gandhi: వారంలోనే ఇలా అయితే ఎలా..? బీజేపీ స‌ర్కార్‌పై మ‌రోసారి వ‌రుణ్ గాంధీ ఫైర్‌

యూపీ బీజేపీ ప్ర‌భుత్వంపై ఆ పార్టీ ఎంపీ వ‌రుణ్ గాంధీ విమ‌ర్శ‌లు చేశారు. ఈనెల 16న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 296 కిలో మీట‌ర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల‌తో ఎక్స్‌ప్రెస్‌వేపై గుంత‌లు ఏర్ప‌డ్డాయి. దీంతో వ‌రుణ్ గాంధీ త‌న ట్విట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేశారు. వారం రోజుల్లోనే రోడ్డు ఇలా అయితే ఎలా అంటూ ప్ర‌శ్నించారు.

Varun Gandhi: వారంలోనే ఇలా అయితే ఎలా..? బీజేపీ స‌ర్కార్‌పై మ‌రోసారి వ‌రుణ్ గాంధీ ఫైర్‌

Varun Gandi

Varun Gandhi: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన 296 కిలో మీట‌ర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన ప్రారంభించారు. చిత్ర‌కూట్ లోని భ‌ర‌త్ కూప్ నుంచి ఇటావాలోని కుంద్రెల్‌ను క‌లిపే ఈ నాలుగు లైన్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వే ను దాదాపు రూ.15వేల కోట్ల‌తో నిర్మించారు. అయితే గ‌త కొద్దిరోజులుగా కురుస్తోన్న వ‌ర్షాల‌కు ఈ ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బ‌తింది. జ‌లౌన్ జిల్లా స‌మీపంలో కొన్నిచోట్ల పెద్ద గుంత‌లు ఏర్ప‌డ్డాయి. దీంతో రోడ్డు నిర్మాణంలో నాణ్య‌త‌పై ప్ర‌భుత్వం తీరును త‌ప్పుబ‌డుతూ విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

గ‌త కాంత‌కాలంగా ప‌లు అంశాల‌పై సొంత ప్ర‌భుత్వంపైనే విమ‌ర్శ‌లు చేస్తోన్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మ‌రోసారి బీజేపీ ప్ర‌భుత్వం ప‌నితీరును త‌ప్పుబ‌ట్టారు. వారం రోజుల క్రితం ప్ర‌ధాని ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వే ఇలా అయితే ఎలా అంటూ ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. ప్రాజెక్ట్ హెడ్‌, నిర్మాణంలో భాగ‌స్వాములైన కంపెనీలు, ఇంజినీర్ల‌కు వెంట‌నే స‌మ‌న్లు జారీ చేయాల‌ని, బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వ‌రుణ్ ట్విట‌ర్ వేదిక‌గా డిమాండ్ చేశారు.

Madhya Pradesh : స్కూటర్ సరిగ్గా నడపమన్నందుకు డిప్యూటీ కలెక్టర్ పై దాడి చేసిన దంపతులు

ఇదిలాఉంటే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో నాణ్య‌త‌పై స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్ బీజేపీ ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డ్డారు. అయితే వ‌రుణ్ గాంధీ చేసిన ట్వీట్ ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు బ‌లంచేకూర్చిన‌ట్ల‌యింది.