OnePlus 10 5G : వన్‌ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు లీక్..!

OnePlus 10 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. 2022 ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (10 Pro) రిలీజ్ చేసింది.

OnePlus 10 5G : వన్‌ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు లీక్..!

Oneplus 10 5g Launching Soon New Leaks Surface Online

OnePlus 10 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. 2022 ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (10 Pro) రిలీజ్ చేసింది. అయితే త్వరలో వన్‌ప్లస్ 10 5G ఫోన్ లాంచ్ కానుందని రుమార్లు మొదలయ్యాయి. అంతేకాదు.. కొన్ని లీక్‌లు కూడా వచ్చాయి. మొదటి లీక్ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ నుంచి వచ్చింది. OnePlus 10 స్మార్ట్ ఫోన్ ఉందని, త్వరలో లాంచ్ అవుతుందని తెలిపాడు.

ఈ డివైజ్ ప్రాజెక్ట్ ఓవల్టైన్ అనే టెక్నికల్ కోడ్‌తో ఉందని స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCని కలిగి ఉందని బ్రార్ పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న OnePlus 10 Pro కూడా అదే చిప్‌సెట్‌ని కలిగి ఉంది. OnePlus 10 కొత్త లీక్‌కు ముందు MediaTek Dimensity 9000 SoCని కలిగి ఉందని రుమర్లు వచ్చాయి. టిప్‌స్టర్ మ్యాక్స్ జాంబోర్ ఓవల్టైన్ వన్‌ప్లస్ 10 కాదని, వన్‌ప్లస్ 10T 5G అని ట్వీట్ చేశాడు. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCతో Ovaltine వన్‌ప్లస్ నుంచి ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుందని టిప్ స్టర్ ట్వీట్ చేసింది.

Oneplus 10 5g Launching Soon New Leaks Surface Online (1)

Oneplus 10 5g Launching Soon New Leaks Surface Online

అది కూడా ఏకైక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 10T 5G అని టిప్‌స్టర్ ట్వీట్ చేసింది. Snapdragon 8+ Gen 1 SoCతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. OnePlus 10T 5G కొత్త Qualcomm SoCని కలిగి ఉండవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC కూడా 4nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. 3.2GHz కొంచెం ఎక్కువ క్లాక్ స్పీడ్‌తో వస్తుంది. 10 శాతం మెరుగైన CPU, GPU ఫర్ఫార్మెన్స్ అందిస్తూ 30 శాతం వరకు మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తుంది.

OnePlus కంపెనీ.. ప్రస్తుతం Snapdragon 8+ Gen 1 SoC-ఆధారిత డివైజ్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. లాంచ్ టైమ్‌లైన్ గురించి కూడా కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఈ ఫోన్ అక్టోబర్ 2022 నాటికి లాంచ్ అవుతుందని అంచనా. OnePlus 10T 5G 2020లో లాంచ్ అయిన OnePlus 8T తర్వాత సిరీస్‌లో మొదటి స్మార్ట్‌ఫోన్ కానుంది.

Read Also : Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!