OnePlus 11 Launch India : భారత్‌కు వన్‌ప్లస్ 11 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు రివీల్ చేసిందిగా..!

OnePlus 11 Launch India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి 11 సిరీస్ ఫోన్ వస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (OnePlus 11 Series) రాబోతోంది.

OnePlus 11 Launch India : భారత్‌కు వన్‌ప్లస్ 11 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు రివీల్ చేసిందిగా..!

OnePlus 11 is launching in India, here are 3 features already confirmed

OnePlus 11 Launch India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి 11 సిరీస్ ఫోన్ వస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (OnePlus 11 Series) రాబోతోంది. 2023
ఫిబ్రవరి 7న భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.

OnePlus 11తో పాటు, OnePlus Buds Pro 2 రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వన్‌ప్లస్ సిరీస్ లాంచ్‌కు ముందు.. OnePlus 11 అనేక ముఖ్యమైన ఫీచర్లు, స్పెషిఫికేషన్లను అధికారికంగా వెల్లడించింది. రాబోయే OnePlus 11లో మరో కొత్త 3 ఫీచర్లను ముందుగానే రివీల్ చేసింది. అవేంటో ఓసారి చూద్దాం..

స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ :
వన్‌ప్లస్ సిరీస్ ఫోన్‌లో Qualcomm నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ను లాంచ్ చేసింది. సరికొత్త ఫ్లాగ్‌షిప్ చిప్‌తో ఫోన్‌ను లాంచ్ చేసిన మొదటి కంపెనీలలో వన్‌ప్లస్ ఒకటిగా ఉంటుందని OnePlus తెలిపింది. అధికారిక టీజర్‌ ద్వారా కంపెనీ రాబోయే OnePlus ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో వస్తుందని గతంలో ధృవీకరించింది. దీనికి సంబంధించి వేరియంట్‌లు ఇంకా ధృవీకరించలేదు. కానీ, ఫోన్ 12GB వరకు RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో సపోర్టు చేసే అవకాశం ఉంది.

OnePlus 11 is launching in India, here are 3 features already confirmed

OnePlus 11 is launching in India, here are 3 features already confirmed

Read Also :  OnePlus Jio 5G Support : వన్‌ప్లస్‌ ఫోన్లలోనూ జియో 5G సపోర్టు.. మీ ఫోన్ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్టు ఇదిగో..!

అలర్ట్ స్లైడర్ (Alert Slider) :
OnePlus 11 లాంచ్ తేదీని నిర్ధారించే సమయంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు అలర్ట్ స్లైడర్ (Alert Slider) తిరిగి వస్తోందని వెల్లడించింది. రీకాల్ చేసేందుకు లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ The OnePlus 10T 5Gతో సహా కొన్ని లేటెస్ట్ OnePlus డివైజ్ నుంచి అలర్ట్ స్లైడర్ తొలగించడం జరిగింది. OnePlus 11తో కంపెనీ అలర్ట్ స్లైడర్‌ను తిరిగి తీసుకువస్తోంది.

హాసెల్‌బ్లాడ్ కెమెరాలు (Hasselblad Cameras) :
OnePlus 11 సిరీస్ ఫోన్ ద్వారా Hasselbladతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కెమెరా స్పెసిఫికేషన్లు ఇంకా తెలియనప్పటికీ, Hasselblad భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే కెమెరా పనితీరు టాప్ క్లాస్‌గా ఉంటుందని భావించవచ్చు. కంపెనీ ఫ్లాగ్‌షిప్ డివైజ్ కోసం Hasselbladతో భాగస్వామ్యం చేయడం ఇదే మొదటిసారి కాదు.

వన్‌ప్లస్ ధృవీకరించిన 3 ఫీచర్లను పరిశీలిస్తే.. OnePlus 11 ప్రధానంగా టాప్-లైన్ కెమెరాలు, పనితీరుతో సున్నితమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించడంపై దృష్టి పెడుతుందని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus 11T కన్నా పెద్ద అప్‌గ్రేడ్‌గా రానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వన్ ప్లస్ నుంచి అనేక ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అందులో వన్‌ప్లస్ ఆధారిత స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా పాపులర్ అయ్యాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Jio 5G Support : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో జియో 5G సపోర్టు.. ఏయే ఫోన్ మోడల్స్ ఉన్నాయంటే? ఇదిగో ఫుల్ లిస్ట్.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!