Pathaan Collections : 700 కోట్ల దగ్గర ఆగిన పఠాన్.. నత్తనడకన 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా?

పఠాన్ సినిమా 9 రోజుల్లో దాదాపు 720 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. శుక్రవారం నాడు ఒక్క రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొదట రోజుకి 100 కోట్లు అంటూ దూసుకుపోయిన పఠాన్ సినిమా ఇప్పుడు.................

Pathaan Collections : 700 కోట్ల దగ్గర ఆగిన పఠాన్.. నత్తనడకన 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా?

Pathan Collects 720 crores.. 1000 crore target is in doubt

Pathaan Collections :  షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపించడం, ఇప్పట్లో బాలీవుడ్ లో, వేరే పరిశ్రమలలో కూడా స్టార్ హీరోల సినిమాలు ఏమి రిలీజ్ కి లేకపోవడంతో పఠాన్ కి మరింత కలిసొచ్చింది. సినిమా విజయం సాధించడమే కాకుండా కలెక్షన్స్ కూడా భారీగా రాబడుతుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా బుధవారం రిలీజయి ఆదివారం వరకు ఆగకుండా కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. కేవలం అయిదు రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి పలు రికార్డులని సెట్ చేసింది. ఇండియాలో అత్యధికంగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన హిందీ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇక వీకెండ్ అయిపోవడంతో సోమవారం నుంచి కలెక్షన్స్ మెల్లిగా తగ్గుకుంటూ వచ్చాయి. పఠాన్ కలెక్షన్స్ జోరు చూసి ఇల్లాగే వెళ్తూ 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది, బాహుబలి, KGF రికార్డులు బద్దలుకొడుతుందని బాలీవుడ్ వాళ్ళు భావించారు.

పఠాన్ సినిమా 9 రోజుల్లో దాదాపు 720 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. శుక్రవారం నాడు ఒక్క రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొదట రోజుకి 100 కోట్లు అంటూ దూసుకుపోయిన పఠాన్ సినిమా ఇప్పుడు నెమ్మదించింది. పఠాన్ సినిమాకి కలెక్షన్స్ తెప్పించడం కోసం బాలీవుడ్ అంతా ఒక్కటయి తమ సినిమాలని కూడా వాయిదా వేస్తూ పఠాన్ సినిమాని మరింత ప్రమోట్ చేశారు. కానీ సినిమా రిలీజయి వారం రోజులు దాటిపోవడం, వేరే పరిశ్రమలలో కొన్ని సినిమాలు రిలీజవ్వడం.. పఠాన్ కలెక్షన్స్ తగ్గుముఖ్యం పెట్టాయి.

Micheal Review : పాత కథకి KGF ఎలివేషన్స్ జోడించిన మైఖేల్..

చిత్రయూనిట్, బాలీవుడ్ అంతా పఠాన్ 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని సౌత్ సినిమాల రికార్డులని కొట్టాలని టార్గెట్ పెట్టుకుంది. మరి ఇప్పుడు నత్తనడకన వస్తున్న ఈ కలెక్షన్స్ చూసి 1000 కోట్లు పఠాన్ కొల్లగొడుతుందా అని సందేహం కలగక మానదు. ఇదే రీతిలో రోజుకు 25 కోట్లు కలెక్ట్ చేసినా ఇంకా పది రోజులు అయినా థియేటర్స్ లో ఆడాలి, జనాలు రావాలి. కానీ అది కష్టమే. చూడాలి మరి పఠాన్ సినిమా 1000 కోట్లు రీచ్ అవుతుందా? మన బాహుబలి, kgf సినిమాలని బద్దలు కొడుతుందా?