Malli Pelli: ‘మళ్ళీ పెళ్లి’ శాంపిల్ చూపెట్టేందుకు రెడీ అయిన పవిత్రా, నరేష్

నరేష్, పవిత్రా జోడీ ఇటీవల తాము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఓ వీడియో క్లిప్ వదిలి నెట్టింట తుఫాను క్రియేట్ చేశారు.

Malli Pelli: ‘మళ్ళీ పెళ్లి’ శాంపిల్ చూపెట్టేందుకు రెడీ అయిన పవిత్రా, నరేష్

Pavithra Naresh Starrer Malli Pelli Teaser On The Way

Malli Pelli: ఆలీ హీరోగా నటించిన ‘యమలీల’ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే ‘మళ్ళీ పెళ్లి’ అనే కవిత విని ప్రేక్షకులు అప్పట్లో ఏ విధంగా నవ్వుకున్నారో అందరికీ తెలిసిందే. ‘మళ్ళీ పెళ్లి’ అనే పదం అప్పట్నుండీ చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల మళ్లీ ఈ పదానికి అంతటి ప్రాముఖ్యత తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా నరేష్, పవిత్రా జోడీ అని చెప్పాలి. వివాదాలతో నిత్యం మీడియాలో కనిపిస్తున్న ఈ జోడీ, ఇటీవల తాము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఓ వీడియో క్లిప్ వదిలి నెట్టింట తుఫాను క్రియేట్ చేశారు.

Naresh-Pavithra : ఇదంతా సినిమా కోసమా.. మళ్ళీ పెళ్లి అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచిన నరేష్, పవిత్ర..

అయితే వారు వదిలిన వీడియో క్లిప్ తమ అప్‌కమింగ్ మూవీ ‘మళ్ళీ పెళ్లి’కి సంబంధించిందని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచింది ఈ జంట. ఇక ఇటీవల ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా, తాజాగా ఈ సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నరేష్, పవితాలు మెయిన్ లీడ్‌లో నటిస్తున్నారు. ఇక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఎంఎస్.రాజు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

కాగా, ఈ సినిమాను నరేష్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ‘మళ్ళీ పెళ్లి’ మూవీ ఎంతమందిని థియేటర్లకు మళ్ళీ వచ్చేలా చేస్తుందో చూడాలి.