Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్...

Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!

Pawan Kalyan Will Be Seen As Professor In Bhavadheeyudu Bhagat Singh

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా సరికొత్తగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఈ సినిమాతో పాటు పవన్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేస్తూ స్పీడ్ మీదున్నాడు.

Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?

ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను అనౌన్స్ చేసిన పవన్, మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమాను ఓకే చేశాడు. అయితే హరీష్ శంకర్‌తో గతంలో పవన్ గబ్బర్‌సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరోసారి సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, ఈ మూవీలో పవన్ పాత్ర గురించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చాలారోజులుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్ ఓ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Pawan Kalyan : సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్..

అయితే ఈ వార్తలపై తాజాగా చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రపై వచ్చిన వార్తలు నిజమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ సినిమాలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో పవన్ కనిపిస్తాడని.. అయితే ఆయన పాత్రలో ఉండే వైవిధ్యం తెరపై చూస్తే అందరూ ఆశ్చర్యపోతారని హరీష్ చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించి, రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తామని డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ పూజా హెగ్డే నటించనుంది. మరి లెక్చరర్ పాత్రలో పవన్ ఎలా కనిపిస్తాడని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.