Paytm Users : పేటీఎం అకౌంట్ లేకుండానే ఇకపై యూజర్లు డబ్బులు పంపుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Paytm Users : ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం (Paytm) ఇప్పుడు తమ యూజర్లకు అన్ని UPI పేమెంట్ల యాప్‌లలో ఏదైనా మొబైల్ నంబర్‌కు UPI పేమెంట్స్ చేసేందుకు అనుమతిస్తుంది.

Paytm Users : పేటీఎం అకౌంట్ లేకుండానే ఇకపై యూజర్లు డబ్బులు పంపుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Paytm users can now send money to people without a Paytm account, here is how

Paytm Users : ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం (Paytm) ఇప్పుడు తమ యూజర్లకు అన్ని UPI పేమెంట్ల యాప్‌లలో ఏదైనా మొబైల్ నంబర్‌కు UPI పేమెంట్స్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, రిసీవర్ Paytmలో అకౌంట్ లేకపోయినా, ఏదైనా UPI రిజిసర్డ్ మొబైల్ నంబర్‌కు Paytm యూజర్లు UPI పేమెంట్లు చేసుకోవచ్చునని డిజిటల్ చెల్లింపుల సర్వీస్ ప్రొవైడర్ ప్రకటించింది. UPI పర్యావరణ వ్యవస్థలో ఇదొక భాగమని కంపెనీ తెలిపింది. ఎందుకంటే మరింత మంది యూజర్లు ఏదైనా UPI యాప్‌కి డబ్బు పంపడానికి వీలు కల్పిస్తుంది.

సురక్షితమైన చెల్లింపుల కోసం యూజర్లకు బలమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. Paytm ఈ కొత్త ఫీచర్ Paytm యాప్ ద్వారా ఇన్‌స్టంట్ క్యాస్ ట్రాన్సాక్షన్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)కి మారడానికి యూజర్లను ప్రోత్సహిస్తుంది. రిసీవర్ Gpay, Amazon Pay, PhonePe లేదా ఏదైనా ఇతర పేమెంట్ల యాప్‌లో రిజిస్టర్డ్ UPI IDని కలిగి ఉంటే చాలు.. Paytm UPI ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బు పంపవచ్చు. ఇంతకుముందు, మొబైల్ నగదు బదిలీని స్వీకరించడానికి రిసీవర్లు పేటీఎం యాప్‌లో యూపీఐ ఐడీని నమోదు చేసుకోవడం తప్పనిసరి.

Paytm users can now send money to people without a Paytm account, here is how

Paytm users can now send money to people without a Paytm account, here is how

Paytm ద్వారా ఇతర UPI యాప్‌లకు డబ్బు పంపడం ఎలా? :
* Paytm ద్వారా ఏదైనా UPI రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి డబ్బు పంపుకోవచ్చు.
* Paytm ఓపెన్ చేసి.. ‘UPI మనీ ట్రాన్స్‌ఫర్’పై Tap చేయండి.
* UPI సెక్షన్ కింద ‘UPI యాప్‌లకు’పై Tap చేయండి.
* మీరు డబ్బు పంపాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
* Gpay లేదా PhonePeతో సహా ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌లో రిసిప్ట్ చెల్లుబాటు అయ్యే UPI idని కలిగి ఉండాలి.
* మీరు ట్రాన్స్‌ఫర్ చేసే మొత్తాన్ని నమోదు చేసి, ‘Pay Now’పై Tap చేయండి.
* ఆ తర్వాత, మీ MPINని నమోదు చేయడం ద్వారా లావాదేవీని ధృవీకరించండి.
* మీ డబ్బు రిసీవర్ బ్యాంక్ అకౌంట్‌కు ఇన్‌స్టంట్ ట్రాన్సాక్షన్ అవుతుంది.

Paytm users can now send money to people without a Paytm account, here is how

Paytm users can now send money to people without a Paytm account, here is how

మీరు రిసీవర్ QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా UPI ద్వారా కూడా డబ్బు పంపవచ్చు. QR కోడ్ ద్వారా డబ్బు పంపేందుకు Paytm యాప్‌లో ‘Payment’పై Tap చేయండి. ఆపై ‘QR కోడ్’ ఎంచుకోండి. రిసీవర్ QR కోడ్‌ని స్కాన్ చేసి, మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి. ఇప్పుడు మీ PINని నమోదు చేయండి. మీ పేమెంట్ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best 5G Phones : నవంబర్‌లో రూ. 15వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!