Ramdev Baba: సనాతన సంప్రదాయానికి చెందిన మహోన్నత వ్యక్తులను అవమానించేవారు దేశ వ్యతిరేకులు: రామ్‌దేవ్ బాబా

సనాతన సంప్రదాయానికి చెందిన మహోన్నత వ్యక్తులను అవమానించేవారు దేశ వ్యతిరేకులని యోగాగురు రామ్‌దేవ్ బాబా అన్నారు. తాజాగా, ఆయన మీడియాతో మాటక్లాడారు. ‘‘సనాతన సంప్రదాయానికి చెందిన మహోన్నత వ్యక్తులపై చాలా మంది అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నవారు అందరూ దేశ వ్యతిరేకులు. అంతర్జాతీయ శక్తుల తరఫున వారు పనిచేస్తున్నారు. దేశం పట్ల గౌరవభావం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వారిని తీవ్రంగా వ్యతిరేకించాలి’’ అని చెప్పారు.

Ramdev Baba: సనాతన సంప్రదాయానికి చెందిన మహోన్నత వ్యక్తులను అవమానించేవారు దేశ వ్యతిరేకులు: రామ్‌దేవ్ బాబా

Ramdev Baba

Ramdev Baba: సనాతన సంప్రదాయానికి చెందిన మహోన్నత వ్యక్తులను అవమానించేవారు దేశ వ్యతిరేకులని యోగాగురు రామ్‌దేవ్ బాబా అన్నారు. తాజాగా, ఆయన మీడియాతో మాటక్లాడారు. ‘‘సనాతన సంప్రదాయానికి చెందిన మహోన్నత వ్యక్తులపై చాలా మంది అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నవారు అందరూ దేశ వ్యతిరేకులు. అంతర్జాతీయ శక్తుల తరఫున వారు పనిచేస్తున్నారు. దేశం పట్ల గౌరవభావం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వారిని తీవ్రంగా వ్యతిరేకించాలి’’ అని చెప్పారు.

స్వయం ప్రకటిత దేవస్వరూపుడు, భాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చుట్టూ వివాదం రాజుకున్న నేపథ్యంలో రామ్ దేవ్ బాబా దీనిపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అద్భుతాలు సృష్టిస్తామంటూ కొందరు ప్రజలను మభ్యపెడుతున్నారు. భౌతిక వాస్తవికతను భారత్ గౌరవిస్తుంది. వంచనకు భారతీయ సంస్కృతి, మతంలో చోటు లేదు. అయితే, భౌతిక శాస్త్రం ఉన్నట్లే, ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ఉంటుంది.. దీన్ని ఎవరూ తోసిపుచ్చకూడదు’’ అని రామ్ దేవ్ బాబా చెప్పారు.

కాగా, పాకిస్థాన్ దివాలా అంచున ఉందని, ఆ దేశం త్వరలోనే నాలుగు భాగాలుగా విడిపోతుందని అన్నారు. పీవోకే, సింధ్, బలూచిస్థాన్ ను భారత్ కలపాలని, భారత్ సూపర్ పవర్ అవుతుందని చెప్పారు. కాగా, పాకిస్థాన్ ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోతున్న విషయం తెలిసిందే.

Dalit man dies: రూ.3 వేల కోసం దళితుడిని కర్రలతో కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు