Mallikarjuna Kharge : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : మల్లికార్జున ఖర్గే
తెలంగాణ సమిష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందన్నారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి తమ బ్లూప్రింట్ సిద్ధమైందని తెలిపారు.

Mallikarjuna Kharge
Mallikarjuna Kharge Tweet : తెలంగాణలోని 3.8 కోట్ల మంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. తెలంగాణ జనగర్జన మహా సభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలో 1,360 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్న తమ నాయకుడు, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కకు అభినందనలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు.
పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారని చెప్పారు. తెలంగాణ సమిష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందన్నారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి తమ బ్లూప్రింట్ సిద్ధమైందని తెలిపారు. సామాజిక న్యాయం మరియు సమానత్వం ఆధారంగా తెలంగాణ అభివృద్ధి మరియు పురోగతికి తాము గట్టిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరుగనుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారు. అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని, ప్రసంగించనున్నారు. హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి, మధుయాష్కీ హుటాహుటిన ఖమ్మం సభకు బయలుదేరారు.