PM Modi degree : ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం, సీఎం కేజ్రీవాల్‌పై గుజరాత్ యూనివర్శిటీ పరువునష్టం దావా..

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ఢిల్లీ సీఎం మోదీ విద్యార్హతలపై ఆప్ నేతలు చేసిన వ్యాఖ్యలు కోర్టులు సైతం అసహన వ్యక్తంచేస్తున్నాయి.

PM Modi degree : ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం, సీఎం కేజ్రీవాల్‌పై గుజరాత్ యూనివర్శిటీ పరువునష్టం దావా..

PM Modi degree..Court issues summons Kejriwal

PM Modi degree : ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ కోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ పై గుజరాత్ యూనివర్సిటీ అహ్మదాబాద్ కోర్టులో పరువునష్టం దావా వేసింది. దీంతో మే 23న వివచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. గుజరాత్ యూనివర్సిటీని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని..అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు నోటీసులు జారీ చేసింది అహ్మదాబాద్ కోర్టు.

ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించి మోదీ డిగ్రీకి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రధాన సమాచార కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను గుజరాత్‌ హైకోర్టు పక్కన పెడుతూ తీర్పు ఇచ్చింది. ఆ తరువాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సంజయ్‌సింగ్‌ మీడియా సమావేశాల్లోను, సోషల్ మీడియాల్లోను చేసిన వ్యాఖ్యలు తమ యూనివర్శిటీని అవమానించేలా ఉన్నాయని  కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు వర్శిటీ రిజిస్ట్రార్‌. దీంతో అహ్మదాబాద్ కోర్టు వీరిద్దరికి సమన్లు జారీ చేసింది.

కాగా ప్రధాని మోదీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పాలంటూ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయటం..దీనిపై విచారణ జరిపిన కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ..పీఎంవో ఈ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఈ వివరాలు బయట పెట్టాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ ఈ తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఈ పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది గుజరాత్ హైకోర్టు. ఈ క్రమంలో మోదీ డిగ్రీ సర్టిఫికెంట్ అంశంపై తమ యూనివర్శిటీని అవమానించేలా వ్యాఖ్యనించారంటూ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు నోటీసులు జారీ చేసింది అహ్మదాబాద్ కోర్టు.