PM Modi at Kedarnath Dham : ఉత్తరాఖండ్‌లో కనెక్టివిటీ ప్రాజెక్ట్‌‌‌కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ .. సులభతరం కానున్న బద్రీనాథ్, కేదార్‌నాథ్ దర్శనం

దేవభూమి ఉత్తరాఖండ్‌లో.. ఈ రెండే కాదు మరెన్నో దివ్య క్షేత్రాలున్నాయ్. కానీ.. అక్కడికి వెళ్లి.. శివ, నారాయణులను దర్శించుకోవాలంటే.. అది సాహసంతో కూడుకున్న పని. ఈ కారణంతోనే చాలా మంది కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లేందుకు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అయితే.. కొన్ని నెలల్లోనే.. ఈ రెండు దివ్య క్షేత్రాలను చేరుకోవడం సులభతరం కాబోతోంది. ఇందుకోసం.. మోదీ ప్రభుత్వం అద్భుతమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

PM Modi at Kedarnath Dham : ఉత్తరాఖండ్‌లో కనెక్టివిటీ ప్రాజెక్ట్‌‌‌కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ .. సులభతరం కానున్న బద్రీనాథ్, కేదార్‌నాథ్ దర్శనం

PM Modi offers prayers at Kedarnath Dham in Uttarakhand

PM Modi offers prayers at Kedarnath Dham in Uttarakhand : కేదార్‌నాథ్, బద్రీనాథ్.. ప్రతి హిందువు దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రాలివి. దేవభూమి ఉత్తరాఖండ్‌లో.. ఈ రెండే కాదు మరెన్నో దివ్య క్షేత్రాలున్నాయ్. కానీ.. అక్కడికి వెళ్లి.. శివ, నారాయణులను దర్శించుకోవాలంటే.. అది సాహసంతో కూడుకున్న పని. ఈ కారణంతోనే చాలా మంది కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లేందుకు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అయితే.. కొన్ని నెలల్లోనే.. ఈ రెండు దివ్య క్షేత్రాలను చేరుకోవడం సులభతరం కాబోతోంది. ఇందుకోసం.. మోదీ ప్రభుత్వం అద్భుతమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

ఉత్తరాఖండ్ అంటే.. ఉత్తర భారతంలోనే కాదు.. దక్షిణాదిలోనూ గుర్తొచ్చే పిక్చర్ ఇదే. అక్కడ సంభవించే ప్రకృతి విపత్తులు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంటాయ్. ముఖ్యంగా.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు కొలువైన ప్రాంతాల్లో ఒక్కోసారి సడన్‌గా వరదలు సంభవిస్తుంటాయ్. అక్కడికి వెళ్లిన ఎందరో భక్తులు.. ఎన్నో రకాలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే.. ఎన్ని అడ్డంకులెదురైనా.. ఎన్ని ఇబ్బందులనైనా అధిగమించి.. భక్తులు ఆ శివ, కేశవులను దర్శించుకుంటారు. కానీ.. ఇదేమంత సులువైన విషయం కాదు. ఎంతో కష్టంతో కూడుకున్నది. అందువల్ల.. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో.. 3 వేల 400 కోట్లకు పైగా విలువైన కనెక్టివిటీ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వీటి ద్వారా శివనారాయణుల దర్శనం సులువవడంతో పాటు.. మతపరంగా టూరిజం కూడా ఎంతో మెరుగుపడనుంది.

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో.. సుమారు 3 వేల 583 మీటర్ల ఎత్తులో కేదార్‌నాథ్ ఆలయం కొలువై ఉంది. ఇక్కడ.. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలు, పంచకేదార్లలో ఒకటైన.. శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. అందమైన హిమాలయాల మధ్య.. ఈ అద్భుతమైన ఆలయాన్ని 8వ శతాబ్దంలో.. గొప్ప హిందూ ఆధ్యాత్మిక గురువు ఆదిశంకరాచార్యులు నిర్మించారని నమ్ముతారు. అయితే.. 2013లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా.. కేదార్‌నాథ్ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు ధ్వంసమైనప్పటికీ.. ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఆ వరదల్లో.. వందలాది మంది యాత్రికులు మరణించారు. వేలల్లో గాయపడ్డారు. అయితే.. ఈ ఘటన తర్వాత ఆలయ ట్రెక్కింగ్ మార్గాన్ని అధికారులు మార్చారు. కొత్త మార్గం.. 21 కిలోమీటర్లు ఉంటుంది. దీని గుండా ఆలయాన్ని చేరుకోవడం ఎంతో కష్టతరమైన వ్యవహారం. దీని నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు.. కేంద్ర ప్రభుత్వం కేదార్‌నాథ్ రోప్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. మందాకిని ఆస్థపథం, సరస్వతీ ఆస్థపథం వెంబడి రివర్ ఫ్రంట్ అభివృద్ధిపైనా కేంద్రం దృష్టి పెట్టింది. ఇప్పటికే.. అక్కడ పనులు మొదలయ్యాయి.

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో.. అలకనంద నదీ తీరాన కొలువై ఉన్న బద్రీనాథ్‌లో.. శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం.. 3 వేల 133 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం చార్‌ధామ్, చోటా చార్‌ధామ్ తీర్థయాత్రల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఆ నారాయణుడికి అంకితం చేసిన 108 దివ్య దేశాల్లో.. బద్రీనాథ్ క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ.. మహా విష్ణువు.. బద్రీనాథుడిగా కొలువై ఉన్నారు. ఇది.. వైష్ణవుల పవిత్ర మందిరాల్లో ఒకటిగా కొనసాగుతోంది. హిమాలయ పర్వతాల్లో నెలకొన్న తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా.. ఏటా ఆరు నెలల పాటు మాత్రమే బద్రీనాథ్ ఆలయం తెరచి ఉంటుంది. ఏప్రిల్ చివరి నుంచి నవంబర్ మధ్య మాత్రమే.. బద్రీనాథుని దర్శనభాగ్యం కలుగుతుంది. తర్వాత.. చలికాలం మొదలై.. ఏప్రిల్ చివరి దాకా ఆలయం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. బద్రీనాథ్‌లో కొలువై ఉన్న శ్రీమహావిష్ణువే స్వయంభువుగా బద్రీనారాయణు రూపంలో వెలిశారని భావిస్తారు. విష్ణు పురాణం, స్కంద పురాణం లాంటి ప్రాచీన మత గ్రంథాల్లో.. ఆ ఆలయం గురించి ప్రస్తావించారు. క్రీస్తు శకం.. 6 నుంచి 9వ శతాబ్దం మధ్యలో.. అజ్వర్ సాధువులు.. మధ్యయుగపు ప్రారంభకాలంలో.. దీనిని నిర్మించారనే ప్రచారం ఉంది.

కేదార్‌నాథ్‌లో చేపట్టబోయే రోప్‌వే.. దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది.. గౌరీకుండ్‌ని, కేదార్‌నాథ్‌ని కలుపుతుంది. ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రస్తుతం ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలు పడుతోంది. రోప్‌వే గనక అందుబాటులోకి వస్తే.. ఇది 30 నిమిషాలకు తగ్గనుంది. ఇక.. హేమకుండ్ రోప్‌వే ప్రాజెక్ట్.. గోవింద్‌ఘాట్‌ని, హేమకుండ్ సాహిబ్‌ను కనెక్ట్ చేస్తుంది. ఇది దాదాపు పన్నెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం.. ఈ ప్రదేశాల మధ్య ప్రయాణ సమయం రోజు కంటే ఎక్కువే పడుతుంది. అదే.. రోప్‌వే ప్రాజెక్ట్ గనక పూర్తయితే.. 45 నిమిషాల్లోనే గోవింద్‌ఘాట్ నుంచి హేమకుండ్‌కి చేరుకోవచ్చు. ఈ రోప్‌వే.. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్‌కి గేట్ వే అయిన ఘంగారియాను కూడా కలుపుతుంది.

మొత్తం.. 2 వేల 430 కోట్ల అంచనా వ్యయంతో.. ఈ రోప్ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. దీని వల్ల.. ప్రయాణికులకు, భక్తులకు.. స్థిరమైన, సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ రోప్‌వే ప్రాజెక్ట్‌ చేపట్టడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి.. కేదార్‌నాథ్‌ను రిలీజియస్ టూరిజం స్పాట్‌గా ప్రోత్సహించడం, మరొకటి ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగావకాశాలను కల్పించి, ఆర్థికంగా వృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక.. వెయ్యి కోట్లతో.. రోడ్డు విస్తరణ ప్రాజెక్టును కూడా చేపట్టనుంది మోదీ ప్రభుత్వం. ఎన్‌హెచ్-7పై ఉన్న మనా నుంచి మనా పాస్ వరకు, అలాగే జోషిమఠ్ నుంచి మలారి వరకు.. రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఇది.. లాస్ట్ మైల్ దాకా.. భారత సరిహద్దులను చేరుకునేందుకు.. ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని అందించే దిశగా మరో ముందడుగు కూడా కాబోతోంది. ఈ ప్రాజెక్ట్.. కనెక్టివిటీని పెంచడమే కాదు.. వ్యూహాత్మకంగా ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి.