PM KISAN: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.. మీపేరు ఉందోలేదో ఇలా చూసుకోండి ..

అర్హులైన రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద‌ ప్ర‌తీయేటా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కేంద్ర ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేస్తోంది. మూడు విడ‌త‌ల్లో ఒక్కో విడ‌త‌కు రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.6వేలు కేంద్రం అందిస్తుంది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం కింద 10 విడ‌త‌లుగా నిధులు రైతుల ఖాతాల్లో జ‌మ చేసింది..

PM KISAN: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.. మీపేరు ఉందోలేదో ఇలా చూసుకోండి ..

Pm Modi

PM KISAN: అర్హులైన రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద‌ ప్ర‌తీయేటా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కేంద్ర ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేస్తోంది. మూడు విడ‌త‌ల్లో ఒక్కో విడ‌త‌కు రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.6వేలు కేంద్రం అందిస్తుంది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం కింద 10 విడ‌త‌లుగా నిధులు రైతుల ఖాతాల్లో జ‌మ చేసింది. నేడు 11వ విడ‌త నిధుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

Pm Narendar Modi

ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన ల‌బ్ధిదారుల ఖాతాల్లో నిధులు జ‌మ కావాలంటే ఈ-కేవైసీ చేయించుకోవాల‌ని ఇప్ప‌టికే కేంద్రం సూచించింది. ఆ గ‌డువు నేటితో ముగియ‌నుంది. 11 విడ‌త ఈ ప‌థ‌కం కింద రూ.21,000 కోట్ల‌ను అర్హులైన ల‌బ్ధిదారుల ఖాతాల్లో కేంద్రం జ‌మ‌చేయ‌నుంది. ఈ నిధుల‌ను ప్ర‌ధాని మోదీ విడుదల చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మంగ‌ళ‌వారం 10కోట్ల మంది రైతులకు సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఫ‌లాలు అంద‌నున్నాయి.

Pm Modi1

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏడాది పొడవునా వేడుకల జ‌రిపేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ వేడుక‌ల్లో భాగంగా నిర్వ‌హించే జాతీయ కార్యక్రమం ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్స‌లో తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 16 పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడ‌నున్న‌ట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అనంత‌రం పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం నిధుల‌ను విడుద‌ల చేస్తారు.

Pm Modi2

పీఎం కిసాన్ 11వ విడత కొత్త లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా తనిఖీ చేయాలంటే..
– PM KISAN అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ పోర్టల్‌ని సందర్శించండి
– కుడి వైపున “డాష్‌బోర్డ్” అనే పసుపు రంగు ట్యాబ్ ఉంటుంది.. డాష్‌బోర్డ్‌పై క్లిక్ చేయండి
– క్లిక్ చేసిన తర్వాత.. మీరు కొత్త పేజీలోకి వెళ్తారు.
– విలేజ్ డ్యాష్‌బోర్డ్ ట్యాబ్‌లో మీరు మీ పూర్తి వివరాలను పూరించాలి.
– రాష్ట్రం, జిల్లా, మండ‌లం, పంచాయతీని ఎంచుకోండి
– తర్వాత షో బటన్‌పై క్లిక్ చేయండి
– దీని తర్వాత మీరు మీ వివరాలను చూసుకోవ‌చ్చు.

Pm

పిఎం కిసాన్ పథకాన్ని 2019లో పిఎం నరేంద్ర మోడీ ప్రారంభించారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల్లోని అర్హులైన రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద నిధుల‌ను ఈ ప‌థ‌కం ద్వారా అందిస్తున్నారు. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని మూడు నెలల వాయిదాలలో ఒక్కొక్కటి రూ. 2000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు. 2002 జనవరి 1న 10కోట్లకు పైగా అర్హులైన రైతుల ఖాతా్ల‌లో రూ. 21,000 కోట్లకు పైగా 10వ విడతను ప్రధాని విడుదల చేశారు.