Modi Jammu Kashmir Tour : జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

దేశ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ లో పర్యటన సందర్భంగా రూ.20వేల అభివృద్ధి పనులు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

Modi Jammu Kashmir Tour : జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Modi Jammu Kashmir Tour

Updated On : April 24, 2022 / 4:22 PM IST

Modi Jammu Kashmir Tour : దేశ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ లో పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రూ.20వేల అభివృద్ధి పనులు ప్రారంభించారు. అలాగే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

సాంబా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ-అమృత్ సర్-కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించారు. 8.45 కిలోమీటర్ల పొడవున రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్-ఖాజీగంద్ రోడ్డు సొరంగాన్ని ప్రారంభించారు. చినాబ్ నదిపై 850 మెగావాట్ల రాటిల్ జల విద్యుత్ కేంద్రం, 540 మెగావాట్ల క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు భారీ జల విద్యుత్ కేంద్రాలను కిష్వార్ జిల్లాలో నిర్మించనున్నారు. అనంతరం పల్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు.(Modi Jammu Kashmir Tour)

Anupam Kher : మోదీకి అనుపమ్ ఖేర్ గిఫ్ట్.. దీని విశేషం ఏంటంటే

జమ్మూకశ్మీర్ కు అభివృద్ధి అనే సందేశాన్ని తాను మోసుకొచ్చానని ప్రధాని చెప్పారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను ఇవాళ ప్రారంభించానని ప్రకటించారు. పల్లీ గ్రామం దేశంలోనే తొలి కర్బన ఉద్గారాల్లేని పంచాయతీగా నిలిచిందని మోదీ ప్రశంసించారు.

ఈ ఏడాది పంచాయతీ దినోత్సవాన్ని జమ్మూలో జరుపుకుంటున్నామన్నారు. జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్యం మూలస్థాయుల వరకు వెళ్లిందన్నారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల జమ్మూ ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, అయితే, జమ్మూకశ్మీర్ ప్రజల సాధికారత కోసం తాము అన్ని కేంద్ర చట్టాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.(Modi Jammu Kashmir Tour)

”ఎన్నో ఏళ్లుగా జమ్మూకశ్మీర్ ప్రజలకు అమలు కాని రిజర్వేషన్లు ఇప్పుడు అమలవుతున్నాయి. తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటి యువత ఎదుర్కోబోదు. సర్వ కాల సర్వావస్థల్లో మిగతా దేశంతో జమ్మూకశ్మీర్ ను అనుసంధానించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో పర్యాటక రంగానికి ఊపు వచ్చింది. నీటి సమస్య తొలగిపోయేలా పంచాయతీల్లో మహిళలను భాగస్వాములను చేశాం. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లేలా పంచాయతీలు ప్రోత్సహించాలి. రసాయనాల నుంచి భూమిని కాపాడాలి. కాబట్టి రైతులు ఈ దిశగా ముందుకెళ్లాలి. పంచాయతీ అయినా, పార్లమెంట్ అయినా.. పనేది చిన్నది కాదు. వాటి వల్లే మన దేశాభివృద్ధి మరింత జరుగుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi in JandK: ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 జలవనరులను అభివృద్ధి చేయడం, పునరుజ్జీవింపజేయడం లక్ష్యంగా పెట్టుకున్న ‘అమృత్ సరోవర్ మిషన్’ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. 3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్ ఖాజీగుండ్ రోడ్ టన్నెల్‌ను కూడా ఆయన ప్రారంభించారు. 8.45 కి.మీ పొడవైన సొరంగం బనిహాల్-ఖాజిగుండ్ మధ్య రహదారితో 16 కిమీ దూరం తగ్గనుంది. అంతేకాదు ప్రయాణ సమయం సుమారు గంటన్నర తగ్గుతుంది.