Narendra Modi: నేటి నుంచి డిజిటల్ ఇండియా వీక్.. ప్రారంభించనున్న మోదీ

దీనిలో భాగంగా ‘డిజిటల్ ఇండియా భాషిణి’ పేరుతో మరో కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్థానిక భాషల్లో దేశ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే దీని లక్ష్యం. ‘డిజిటల్ ఇండియా జెనెసిస్’ అనే ఇంకో కార్యక్రమాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు.

Narendra Modi: నేటి నుంచి డిజిటల్ ఇండియా వీక్.. ప్రారంభించనున్న మోదీ

Narendra Modi

Narendra Modi: ‘డిజిటల్ ఇండియా 2022’ను ప్రధాని మోదీ నేడు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించనున్నారు. ‘క్యాటలైజింగ్ న్యూ ఇండియాస్ టెకేడ్’ పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దేశాన్ని మరింత డిజిటల్ మయంగా చేయడంతోపాటు, మేధో పరంగా శక్తివంతంగా చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

China : చైనాలో పుచ్చకాయలు, గోధుమలకు ఇళ్లు అమ్ముకుంటున్న బిల్డర్లు

దీనిలో భాగంగా ‘డిజిటల్ ఇండియా భాషిణి’ పేరుతో మరో కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్థానిక భాషల్లో దేశ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే దీని లక్ష్యం. ‘డిజిటల్ ఇండియా జెనెసిస్’ అనే ఇంకో కార్యక్రమాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఇది దేశవ్యాప్తంగా వివిధ టెక్నాలజీ స్టార్టప్‌లకు ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమం. ఈ రెండు డిజిటల్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ‘మై స్కీమ్’ అనే కొత్త పథకాన్ని మోదీ దేశ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకొస్తారు. మై స్కీమ్ ద్వారా ప్రభుత్వ పథకాలన్నింటి గురించి ఒకేచోట తెలుసుకోవచ్చు.

Maharashtra: అవును మాది ‘ఈడీ’ ప్ర‌భుత్వమే: దేవేంద్ర ఫ‌డ్న‌వీస్

ఈ కార్యక్రమం రెండు రోజులపాటు జరుగుతుంది. దీనిలో యూపీఐ, ఆధార్, కోవిన్, డిజిలాకర్ వంటి డిజిటల్ సర్వీసుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 200 స్టాళ్లు ఏర్పాటు చేయగా, వీటిలో అనేక స్టార్టప్‌లు తమ సేవల గురించి వివరిస్తాయి. రూ.20,000 నుంచి మొదలయ్యే అందుబాటు ధరల్లో ఉండే ల్యాప్‌టాప్‌లను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు.