Poco X4 GT leak : పోకో నుంచి ఇండియాకు X4 GT ఫోన్.. లీకైన ఫీచర్లు ఇవేనా..?

Poco X4 GT leak : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి త్వరలో రాబోతోంది.

Poco X4 GT leak : పోకో నుంచి ఇండియాకు X4 GT ఫోన్.. లీకైన ఫీచర్లు ఇవేనా..?

Face To Face With Maheshwar Reddy (2)

Poco X4 GT leak : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి త్వరలో రాబోతోంది. అదే.. Poco X4 GT స్మార్ట్ ఫోన్.. ఈ ఫోన్ లాంచ్ కానున్నట్టు కొన్నిరోజులుగా రుమర్లు వస్తున్నాయి. లేటెస్టుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్లో డేటాను అప్ డేట్ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందు ఈ డేటాను లిస్టు చేస్తారు. దీని ప్రకారం.. భారత మార్కెట్లోకి Poco X4 GT త్వరలో రాబోందనమాట.. టిప్‌స్టర్ ముకుల్ శర్మ బిఐఎస్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ 220412161ని గుర్తించారు.

టిప్ స్టర్ ప్రకారం.. ఈ మోడల్ నంబర్ Poco నెక్ట్స్ ఫోన్ X4 GTగా అంచనా వేస్తోంది. అయితే Poco ఇంకా దీనిపై అధికారికంగా ధృవీకరించలేదు. BIS వెబ్‌సైట్‌లో Poco X4 GT లిస్టు గురించి ఏం వెల్లడించలేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు లేదా డిజైన్ల గురించి వివరాలు అందుబాటులో లేవు. మోడల్ నంబర్ Poco X4 GT భారత-నిర్దిష్ట వెర్షన్ సూచిస్తుంది. Poco X4 GT, Xiaomi 12X లేదా Xiaomi 12iగా రీబ్రాండ్ చేయనున్నట్టు శర్మ చెప్పారు. Poco X4 GT రీబ్రాండెడ్ రెడ్‌మి నోట్ 11T ప్రోగా రానుందని నివేదికలు చెబుతున్నాయి. Poco ఫోన్‌లు చాలా వరకు రీబ్రాండెడ్ Xiaomi (లేదా Redmi) ఫోన్లే ఉంటాయి. రాబోయే Poco X4 GT స్మార్ట్ ఫోన్ కూడా రీబ్రాండెడ్‌గా వచ్చే అవకాశం ఉంది.

Face To Face With Maheshwar Reddy (3)

Face To Face With Maheshwar Reddy

Poco X4 GT స్పెసిఫికేషన్స్ అంచనా :
Poco X4 GT రీబ్రాండెడ్ Redmi Note 11T Pro మోడల్‌గా రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయనేది ఆస్తికగా మారింది. రాబోయే పోకో ఫోన్‌లో Full HD రిజల్యూషన్ 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో రానుంది. అలాగే ఈ ఫోన్ 6.6-అంగుళాల LCDతో రానుంది. Poco X4 GTని MediaTek Dimensity 8100 చిప్‌సెట్ 8GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 OS ఆధారంగా MIUI 13 స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. Poco X4 GT 20-MP సెల్ఫీ కెమెరాతో రావొచ్చు. ఇక వెనుకవైపు, 48-MP ప్రధాన కెమెరా, 8-MP అల్ట్రావైడ్ కెమెరా, 2-MP మూడవ కెమెరాను కలిగి ఉండవచ్చు. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ Poco X4 ఫోన్లో రానుంది.

Read Also :  Poco M4 5G Sale : ఇండియాలో ఫస్ట్ టైం సేల్.. ఈ 5G ఫోన్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఎంతంటే?