Helmet – Mask: మాస్క్, సెకండ్ హెల్మెట్ లేకున్నా ఫైన్ తప్పదు.. బీ అలర్ట్!!

ప్రాణరక్షణ కోసం పెట్టుకునే హెల్మెట్‌ అలంకారం కోసం కాదని తప్పనిసరిగా పెట్టుకునేలా ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు.

Helmet – Mask: మాస్క్, సెకండ్ హెల్మెట్ లేకున్నా ఫైన్ తప్పదు.. బీ అలర్ట్!!

Helmet Fine

Helmet – Mask: ప్రాణరక్షణ కోసం పెట్టుకునే హెల్మెట్‌ అలంకారం కోసం కాదని తప్పనిసరిగా పెట్టుకునేలా ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. బైక్ నడిపే వాళ్లు మాత్రమే కాకుండా.. వెనుకున్న కూర్చున్నవాళ్లు కూడా ధరించేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బైక్ మీద వెళ్లేటప్పుడు ఎవరికైనా లిఫ్ట్‌ ఇచ్చినప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్‌ లేకుంటే యజమానికే జరిమానా తప్పదు.

ప్రస్తుతం టూవీలర్ రైడర్స్ 99 శాతం మంది హెల్మెట్‌ను ఉపయోగిస్తున్నారు. వెనుక కూర్చున్న వాళ్లు కూడా ధరించకపోతే పూర్థి స్థాయిలో సేఫ్టీ ఉన్నట్లు కాదు. రెండేళ్లుగా పిలియన్‌ రైడర్స్‌పై కూడా ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి పెట్టి, వాహనం వెనుక కూర్చున్న వారు హెల్మెట్‌ పెట్టుకోకపోతే చలాన్లు విధిస్తున్నారు.

మాస్క్‌ ధరించకపోతే..
కరోనా తగ్గిందని.. మాస్క్‌ను వదిలేశారా..? ప్రమాదం పొంచి ఉంటుందని మరిచిపోకండి. ఇలాంటి వారినే ట్రాఫిక్ శాఖ అప్రమత్తం చేస్తుంది. ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌ పోలీసులు మాస్క్‌ లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. జరిమానాగా వెయ్యి కచ్చితంగా కట్టాల్సిందే. వాహనం నడుపుతున్న వ్యక్తికే కాదు.. వెనుక కూర్చున్న వారికి సైతం మాస్క్‌ మస్ట్‌.. అంటూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది.

……………………………………………. : నా భర్తకు ప్రాణ హాని ఉంది : పట్టాభి సతీమణి

ఇలా ట్రాఫిక్‌ పోలీసులు నాన్‌-కాంటాక్ట్‌ పద్ధతిలో చలాన్లు విధిస్తున్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు పిలియన్‌ రైడర్‌కు మాస్క్‌ లేకున్నా జరిమానాలు పడుతున్నాయి. ఇంటలిజెన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్ ద్వారా కూడా ఉల్లంఘనదారులకు చలాన్లు జారీ అవుతున్నాయి.

రెండో హెల్మెట్‌
ఇంట్లో రెండు హెల్మెట్లు సమకూర్చుకోవడం తప్పని సరిగా మారుతుంది. ద్విచక్రవాహనం మరొకరి ఇచ్చినా.. చలాన్‌ పడితే వాహన యజమానే చెల్లించాలని మరిచిపోకండి. జాగ్రత్త మరిచిపోకూడదనే చలాన్లు విధిస్తున్నామని ముందే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.