Telangana Police : బండి సంజయ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​కి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు.

Telangana Police : బండి సంజయ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు..

Police Withdraw Additional Security For Bandi Sanjay

Updated On : June 24, 2022 / 5:45 PM IST

Telangana police withdraw additional security for bandi sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​కి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. బండికి ఇచ్చిన పోలీసు భద్రతను ఉపసంహరించుకున్నారు. పెంచిన అదనపు భద్రతను పోలీసులు వెనక్కి తీసుకున్నారు. అగ్నిపథ్ ఆందోళనలు, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ వరకు ఇటీవల బండి సంజయ్​కు ప్రస్తుతమున్న దానికి అదనంగా (1+5) రోప్ పార్టీ, ఎస్కార్ట్ వాహనం ఇచ్చారు. పెంచిన భద్రత గురువారం(23,2022) అమల్లోకి వచ్చింది. అలా వచ్చిన వెంటనే ఒక్కరోజులోనే తిరిగి వెనక్కి తీసుకున్నారు.

దీనిపై బీజేపీ మండిపడుతోంది. బండి సంజయ్ కు ఏమన్నా జరిగితే అది తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత వహించాలి అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ ఒత్తిడితోనే బండి సంజయ్​కి పెంచిన అదనపు భద్రతను వెనక్కి తీసుకున్నారని ఆరోపిస్తోంది బీజేపీ.

కాగా కేంద్ర ప్రకటించిన ఆర్మీ ఉద్యోగాల ‘అగ్నిపథ్​ పథకం’పై ఆందోళనలతో పాటు ఇటీవల కరీంనగర్​లో బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యల క్రమంలో జూన్ 22న పోలీసులు ఆయనకు అదనపు భద్రత కల్పించారు. బండి సంజయ్​కు భద్రత పెంచాలని నిఘా వర్గాలు సూచించడంతో అదనపు భద్రత కల్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపారు. ప్రస్తుతం బండి సంజయ్​కి ఉన్న దానికి అదనంగా(1+5) ఆరుగురితో కూడిన రోప్​ పార్టీని కేటాయించారు. మరో ఎస్కార్టు వాహనం కూడా ఏర్పాటు చేశారు. ఈ అదనపు భద్రత 23న అమల్లో ఉండగా..24న వెనక్కి తీసుకున్నారు.