Meghalaya : కాంగ్రెస్‌‌లో సంక్షోభం, ముకుల్, ఇతర ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరే అవకాశం ?

కాంగ్రెస్ పార్టీకి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. పార్టీలో లుకలుకలు, నేతల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో పార్టీ నష్టాలను ఎదుర్కొంటోంది.

Meghalaya : కాంగ్రెస్‌‌లో సంక్షోభం, ముకుల్, ఇతర ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరే అవకాశం ?

Mukul

Meghalaya Congress : కాంగ్రెస్ పార్టీకి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. పార్టీలో లుకలుకలు, నేతల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో పార్టీ నష్టాలను ఎదుర్కొంటోంది. పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే పంజాబ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా…మేఘాలయలో కూడా పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు టీఎంసీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పార్టీకి చెందిన 12 మంది, ఇతర ఎమ్మెల్యేలు వెస్ట్ బెంగాల లో అధికార పార్టీ అయిన..తృణముల్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Read More : MAA Elections 2021 : నామినేషన్ వెనక్కి తీసుకున్న సీవీఎల్

టీఎంసీ వెస్ట్ బెంగాలే కాకుండా..ఇతర రాష్ట్రాల్లో కూడా పాగ వేయాలని చూస్తోంది. జాతీయ రాజకీయాల వైపు ప్రవేశించడానికి పావులు కదుపుతోంది. అందులో భాగంగా..ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేతలతో టచ్ లో ఉంది పార్టీ అధిష్టానం. ప్రధానంగా…టీఎంసీ మరోసారి అధికారంలోకి రావడానికి వ్యూహాలు పన్నిన ప్రశాంత్ కిశోర్ టీం..సంగ్మాతో చర్చలు జరుపుతోందని సమాచారం. పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరిస్తామని ఓ జాతీయ పత్రికకు సంగ్మా చెప్పారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మార్పులు జరుగుతున్నాయి. దీంతో ఆ పార్టీ తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది. పార్టీ సీనియర్ నాయకులు, గోవా మాజీ ముఖ్యమంత్రి, Luizinho Faleiroలు టీఎంసీ తీర్థం తీసుకున్నారు.