Pooja Hegde: పూజా రేటు కోటి.. సినిమాకు కాదండోయ్!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’గా మారిన అందాల భామ పూజా హెగ్డే, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అమ్మడు ఏ సినిమాలో అడుగుపెట్టినా అది.....

Pooja Hegde: పూజా రేటు కోటి.. సినిమాకు కాదండోయ్!

Pooja Hegde

Pooja Hegde: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’గా మారిన అందాల భామ పూజా హెగ్డే, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అమ్మడు ఏ సినిమాలో అడుగుపెట్టినా అది గ్యారెంటీ హిట్ అనే ముద్ర వేసుకోవడంతో పూజా హెగ్డేకు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే టాలీవుడ్‌ను ఏలేస్తున్న ఈ బ్యూటీ, తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’ చిత్రంలో నటించి కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ రెమ్యునరేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత డిమాండ్ ఉన్న హీరోయిన్ ఏమాత్రం రెమ్యునరేషన్ తీసుకుంటుందో మనం ఊహించుకోవచ్చు.

Pooja Hegde-Rashmika: నువ్వా.. నేనా.. ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ ఇద్దరే!

అయితే ఒక విషయంలో మాత్రం అమ్మడు తన రేటు ఏకంగా కోటి రూపాయలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో అంత తక్కువకు చేయదని తెలుసు.. మరి ఇంకే విషయంలో పూజా తన రేటు కోటిగా ఫిక్స్ చేసిందని అనుకుంటున్నారా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నా కూడా డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఐటెం సాంగ్స్ చేయడం నేటి హీరోయిన్లకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. స్టార్ హీరోయిన్లు అయినా అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గకపోగా, ఎంత అందాల ఆరబోత ఉంటే అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

Pooja Hegde : బుట్టబొమ్మ తర్వాత ఆ రేంజ్ హిట్ ఈ సాంగ్.. ఆ హీరో స్పెషల్ పార్టీ ఇచ్చారు..

తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్3’లో ఓ ఐటెం సాంగ్ చేయాల్సిందిగా పూజా హెగ్డేను అప్రోచ్ అయ్యారట చిత్ర యూనిట్. గతంలోనూ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ‘జిగేలు రాణి’ అంటూ అందాల ఆరబోతతో అదిరిపోయే ఐటెం సాంగ్‌లో కనిపించింది ఈ బ్యూటీ. అయితే ఐటెం సాంగ్ కోసం ఏకంగా కోటి రూపాయలకుపైగా డిమాండ్ చేసిందట ఈ బుట్టబొమ్మ. కాగా చిత్ర యూనిట్ బేరసారాలు చేసి రౌండ్ ఫిగర్‌గా కోటికి సెట్ చేశారట. ఇక ఎఫ్3 చిత్రంలో పూజా ఐటెం సాంగ్ అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.