Movie Release: ఫ్యాన్స్‌కిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్న ప్రభాస్!

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన దగ్గరనుంచి మారిపోయారు. తన కెరీర్ ని కంప్లీట్ గా మార్చేసిన బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఫాన్స్ కిచ్చిన మాటనిలబెట్టుకోవడం లేదు.

Movie Release: ఫ్యాన్స్‌కిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్న ప్రభాస్!

Prabhas

Movie Release: ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన దగ్గరనుంచి మారిపోయారు. తన కెరీర్ ని కంప్లీట్ గా మార్చేసిన బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఫాన్స్ కిచ్చిన మాటనిలబెట్టుకోవడం లేదు. వరసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా.. చెప్పిన మాట మాత్రం తప్పుతూనే ఉన్నారు ప్రభాస్. ప్రభాస్ మాట తప్పడం ఏంటో ఎందుకిలా చేస్తున్నారో అసలు ఆ సంగతేంటో చూద్దాం.

Prabhas Marriage : అందుకే నాకింకా పెళ్ళికాలేదు.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్

ఈ సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అప్పటి వరకూ క్యూట్ గా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉన్న రెబల్ స్టార్ సడెన్ గా ఇండియన్ స్టార్ అయిపోయారు. ఒక్క సినిమా ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. అప్పటినుంచి మాట మీద నిలబడడం లేదు.. ఒక్క సినిమా కూడా చెప్పిన డేట్ కి రిలీజ్ చెయ్యడం లేదు.

Prabhas Movies: పాపం ప్రభాస్.. ఆగని గ్లోబల్ స్టార్ వాయిదాల పర్వం!

ప్రభాస్ 5 ఏళ్ల నుంచి మారిపోయారు. ఆ రోజొస్తాను.. ఈ రోజొస్తాను అంటూ ఆశపడుతూ ఫాన్స్ కిచ్చిన మాట తప్పుతూనే ఉన్నారు. సరే జరిగిందేదో జరిగిపోయింది.. ఆదిపురుష్ సినిమా అయినా అనుకున్న టైమ్ కి వస్తుందనుకుంటే ఆ విషయంలో కూడా మాట తప్పారు ప్రభాస్. సంవత్సరం క్రితం సినిమా అనౌన్స్ చేసి.. జస్ట్ 103 రోజుల్లోనే షూటింగ్ ఫినిష్ చేశారు ఆదిపురుష్ టీమ్. ఆగస్ట్ 11న ఆదిపురుష్ రిలీజ్ అని స్టార్టింగ్ లోనే అనౌన్స్ చేసిన టీమ్ నవంబర్ లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు కాబట్టి.. సినిమా ఆ డేట్ కంటే ముందే వస్తుందని అనుకున్నారు ఫాన్స్. కానీ ఈ విషయంలో కూడా మాట తప్పారు ప్రభాస్. ఆగస్ట్ 11 2022 నుంచి ఏకంగా జనవరి 12 2023కి షిఫ్ట్ అయ్యింది సినిమా.

Prabhas: పాన్ వరల్డ్ రేంజ్.. ప్రభాస్ ఇకపై పాన్ ఇండియాస్టార్ కాదు!

ఇక రాధేశ్యామ్ రిలీజ్ గురించైతే చెప్పనక్కర్లేదు. 2018లో మొదలైన రాధేశ్యామ్ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ గండాలు ఫేస్ చేస్తూనే ఉంది. వరసగా యాక్షన్ మూవీలు చేస్తున్న ప్రభాస్ యాక్షన్ కి బ్రేక్ ఇచ్చి లవర్ బాయ్ గా కనిపస్తున్న రాధేశ్యామ్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. కానీ ప్రభాస్ ఇప్పుడొస్తున్నా.. అప్పుడొస్తున్నా అని మాట ఇచ్చి తప్పుతూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ జులైలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా.. ఈ జనవరికి పోస్ట్ పోన్ అయ్యింది. ఇక సంక్రాంతికి ప్రభాస్ సందడితో పండగ చేస్కుందామనుకున్న ఫాన్స్ కి సినిమా మార్చి 11కి పోస్ట్ పోన్ అయ్యిందని చెప్పి మళ్లీ డిసప్పాయింట్ చేశారు ప్రభాస్.

Prabhas : బాక్సాఫీస్ ‘బాహుబలి’.. రెమ్యునరేషన్‌తో పాటు థియేట్రికల్ షేర్!

కేజీఎఫ్ లాంటి భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ తెరకెక్కిస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో కూడా ప్రభాస్ పాన్స్ కిచ్చినమాట తప్పారు. ఏప్రిల్ 14 2022 సలార్ రిలీజ్ అని స్టార్టింగ్ లోనే అనౌన్స్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు ఆ సినిమాని కూడా అనుకున్న టైమ్ కి రిలీజ్ చెయ్యడం లేదు. జులైలో రిలీజ్ అన్న టాక్ నడుస్తున్నా.. ఇప్పుడున్న పరిస్తితిలో అప్పుడు కూడా రిలీజ్ అయ్యే సీన్ కనిపించడం లేదు.

Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన హెవీ యాక్షన్ మూవీ సాహో. సుజిత్ డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సాహో విషయంలో కూడా ఫాన్స్ ని డిసప్పాయింట్ చేశారు ప్రభాస్. 2017లో స్టార్ట్ అయ్యి 2019 ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సాహో.. ఆ డేట్ కి కాకుండా ఆగస్ట్ 30న రిలీజ్ అయ్యి మరోసారి ప్రభాస్ ఇచ్చిన మాట తప్పేలా చేసింది.

Prabhas : 2023 సమ్మర్‌లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ K’ విడుదల

అసలు బాహుబలి 2 నుంచి ప్రభాస్.. రిలీజ్ విషయంలో ఫాన్స్ కిచ్చిన మాట తప్పుతూనే ఉన్నారు. సెకండ్ పార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టీమ్.. అప్పుడు కూడా అనౌన్స్ చేసిన టైమ్ కి రాలేదు. బాహుబలి ఫస్ట్ పార్ట్ చూసిన ఆడియన్స్.. సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేశారు. డిసెంబర్ 2015లో మొదలైన బాహుబలి 2 జనవరి 17న రిలీజ్ కావల్సి ఉంది. కానీ ఈ సినిమా కూడా అనుకున్న డేట్ కి రిలీజ్ కాకుండా ఏప్రిల్ 28 2017లో రిలీజ్ అయ్యింది. ఇలా ప్రభాస్ రిలీజ్ విషయంలో ఫాన్స్ కిచ్చిన మాట తప్పుతూనే ఉన్నారు. అయితే ఫాన్స్ మాత్రం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నాడని సరిపెట్టుకుంటున్నారు.