Premante Enti : మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లారు.. దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ విన్నారా!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెరీర్లో ‘పెళ్లిసందడి’ సినిమా స్పెషల్ ఫిలిం.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘పెళ్లిసందడి’ లో నటించిన శ్రీకాంత్ తనయుడు హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న సినిమా ‘‘పెళ్లిసందD’’..

Premante Enti : మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లారు.. దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ విన్నారా!

Premante Enti

Premante Enti: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెరీర్లో ‘పెళ్లిసందడి’ సినిమా స్పెషల్ ఫిలిం.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘పెళ్లిసందడి’ లో నటించిన శ్రీకాంత్ తనయుడు హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న సినిమా ‘‘పెళ్లిసందD’’.. గౌరి రోనంకి దర్శకురాలిగా, శ్రీ లీల కథానాయికగా పరిచయమవుతున్నారు.

PelliSandadi

కె.కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్‌.కె.ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్ల మీద మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు..
‘‘పెళ్లిసందD’’ లోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేశారు.. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే.. నటరత్న ఎన్టీఆర్ గారితో దర్శకుడిగా ‘‘అడవి రాముడు’’ వంటి బ్లాక్ బస్టర్.. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన ‘‘బాహుబలి’’ చిత్రాల సమర్పకుడిగా వ్యవహరించారు రాఘవేంద్రరావు (ఈ రెండు సినిమాలూ ఏప్రిల్ 28నే విడుదలయ్యాయి).. దీంతో ఈరోజే ‘‘పెళ్లిసందD’’ లోని ఫస్ట్ పాట వదిలారు..

స్వరవాణి కీరవాణి ట్యూన్‌కి చంద్రబోస్ అందమైన పదాలు రాయగా.. హరిచరణ్, శ్వేత పండిట్ అద్భుతంగా ఆలపించారు.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది.. అప్పటి ‘పెళ్లిసందడి’ లానే ఈ ‘‘పెళ్లిసందD’’ కూడా ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు దర్శకేంద్రుడు.. త్వరలో ‘‘పెళ్లిసందD’’ ప్రేక్షకుల ముందుకు రానుంది..