PM Modi: ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. ఇండియా దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్

PM Modi: ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Pm Modi

PM Modi: ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. ఇండియా దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూసింది. బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. నిరాహార దీక్షలు, త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా రెపరెపలాడింది.

బానిస పాలన నుండి విముక్తి పొందిన రోజున గుర్తుగా.. భావి తరాలకు స్ఫూర్తిగా ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర్య దినోత్సవాన్నిజరుపుకుంటూ వస్తున్నాం. మహానీయులను గుర్తు చేసుకుంటున్నాం. నేడు దేశానికి 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి.. స్వాతంత్ర్య దినోత్సవం మనకు పండగ దినం. మన స్వాతంత్ర్య కాంక్ష ఎంతో మంది త్యాగధునల ఫలితం. అందులో మనకు తెలిసినవాళ్లు ఉన్నారు, తెలియని వాళ్లు కూడా ఉన్నారు.

ఈ దేశం కోసం ఎందరో గొప్ప త్యాగాలు చేశారు. అలాంటి గొప్ప వీరులకు నా తల వంచి నమస్కరిస్తున్నాను. గత 75 ఏళ్లలో పలు రంగాల్లో అందనంత ఎత్తుకు ఎదిగాం. భారత భవిష్యత్‌లో బాలికలు, మహిళలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఇక ప్రధాని ఈ స్వాతంత్ర్య పర్వదినం ప్రతి ఒక్క భారతీయ పౌరుడిలో నూతన ఉత్తేజాన్ని, స్ఫూర్తిని రగించాలని ఆకాంక్షించిన ప్రధాని జై హింద్ అంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.