RML హాస్పిటల్ ను సందర్శించి..సెక్యూరిటీ గార్డులను అప్యాయంగా పలకరించిన మోదీ

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా హాస్పిటల్ ను సంద‌ర్శించారు.

RML హాస్పిటల్ ను సందర్శించి..సెక్యూరిటీ గార్డులను అప్యాయంగా పలకరించిన మోదీ

Pm (1)

PM Modi దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా హాస్పిటల్ ను సంద‌ర్శించారు. దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు.

హాస్పిటల్ అంతా క‌లియ‌తిరుగుతూ సెక్యూరిటీ గార్డ్స్‌ను ఆప్యాయంగా ప‌లుక‌రించారు ప్రధాని మోదీ. హాస్పిటల్ సిబ్బందికి ప్ర‌ధాని మోదీ విజ‌య సంకేతం ఇచ్చారు. హెల్త్ కేర్ వ‌ర్క‌ర్స్‌తో పాటు ఓ దివ్యాంగురాలితో మోదీ మాట్లాడారు. హాస్పిటల్ సిబ్బందికి ప్ర‌ధాని మోదీ విజ‌య సంకేతం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన‌ వ్యాక్సినేష‌న్ కేంద్రాన్ని మోదీ ప‌రిశీలించారు.

మరోవైపు,ఢిల్లీ ఎయిమ్స్​లోని NCI(నేషనల్​ కేన్సర్​ ఇన్​స్టిట్యూట్​)లో ఇన్ఫోసిస్​​ సంస్థకు చెందిన విశ్రామ సదన్​ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ. 93 కోట్ల వ్యయంతో విశ్రామ్​ సదన్​ను ఇన్ఫోసిస్​ను నిర్మించింది. కేన్సర్​ బాధితుల కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకునేందుకు ఏసీతో కూడిన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్​​ సిబ్బందిని మోదీ అభినందించారు. అక్కడ భూమి, విద్యుత్​, నీరు ఏర్పాట్లకు ఎయిమ్స్​ ఝజ్జర్​ ఏర్పాట్లు చేసింది. దేశ ఆరోగ్యసేవలను మెరుగుపరిచేందుకు భారత్ ​లోని కార్పొరేటు, ప్రైవేటు రంగాలు, సామాజిక వ్యవస్థలు ఎనలేని కృషిచేస్తున్నాయని కొనియాడారు ప్రధాని. జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడంలో ప్రైవేటు రంగానిదే కీలక పాత్ర అన్నారు.

ఇక, దేశంలో వ్యాక్సిన్ పంపిణీ 100కోట్ల డోసులు దాటిన క్రమంలో ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడికి దక్కుతుందన్నారు. కరోనాపై పోరులో దేశ ప్రజలకు 100కోట్ల టీకాల ‘సురక్షిత కవచం’ లభించిందన్నారు. ఈ అద్భుత‌మైన ఘ‌న‌త సాధ‌న కోసం కృషి చేసిన డాక్ట‌ర్లు, న‌ర్సులు, అంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఇండియా చ‌రిత్ర సృష్టించిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. భార‌తీయ సైన్సు, వ్యాపారంతో పాటు 130 కోట్ల మంది భార‌తీయుల స్పూర్తికి ఇది సాక్ష్య‌మ‌న్నారు.

ALSO READ Hari Hara Veera Mallu: పవన్ రాక మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?