Private Train: తొలి ప్రైవేటు రైలు ప్రారంభం

‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.

Private Train: తొలి ప్రైవేటు రైలు ప్రారంభం

Private Train

Private Train: దేశంలో తొలి ప్రైవేటు రైలు ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది. ‘దేఖో అప్నా దేశ్’ పేరుతో బయలుదేరిన ఈ రైలులో దాదాపు 1100 మంది ప్రయాణికులు ఉన్నారు. గురువారం ఉదయం ఏడున్నర గంటల వరకు రైలు సాయినగర్ షిరిడీకి చేరుకుంటుంది. తిరిగి శుక్రవారం ఉదయం బయలుదేరి, శనివారం మధ్యాహ్నం కోయంబత్తూరు చేరుకుంటుంది.

PUBG: పబ్‌జి ఇంకా ఎలా వస్తోందో చెప్పండి: కేంద్రానికి ఎన్‌సీపీసీఆర్ లేఖ

వెళ్లేటప్పుడు మార్గమధ్యలో మంత్రాలయం వద్ద రైలు ఐదు గంటలు ఆగుతుంది. ఈ సమయంలో భక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవచ్చు. ఈ రైలులో ప్రయాణించేందుకు ఐదు రోజుల టూర్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ షిరిడీ వెళ్లి, అక్కడ్నుంచి ఇదే రైలులో తిరిగి రావొచ్చు. రైలును ఆధునికంగా తీర్చిదిద్దారు. రైలులో డాక్టర్, రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు, ఏసీ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది ఉంటారు. టూర్ ప్యాకేజీ కింద రైలులో శాకాహార భోజనం కూడా అందిస్తారు. భక్తులకు షిరిడీలో వీఐపీ దర్శనం, ఏసీ రూమ్స్, టూరిస్ట్ గైడ్స్, స్థానిక రవాణా వంటివి కూడా ప్యాకేజీలో భాగంగా అందిస్తారు.