Oscar 2023 : ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా.. ఎన్టీఆర్, చరణ్, ప్రీతి జింతా సందడి!

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఆస్కార్ కోసం వచ్చిన వారికీ ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, ప్రీతి జింతా...

Oscar 2023 : ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా.. ఎన్టీఆర్, చరణ్, ప్రీతి జింతా సందడి!

Priyanka Chopra gave pre oscar party to ntr, ram charan and indian film makers

Updated On : March 11, 2023 / 2:25 PM IST

Oscar 2023 : టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఆస్కార్ రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు పోటీ పడుతుంది. మార్చి 12న (IST మార్చి 13 ఉదయం 5:30 గంటలకు) ఈ అవార్డుల వేడుక జరగనుంది. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇటీవలే హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’లో కూడా నటించింది. హాలీవుడ్ వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఆస్కార్ కోసం వచ్చిన వారికీ ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది.

RRR : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా?

ఈ పార్టీకి దక్షిణాసియా ఫిలిం ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులకు హాజరయ్యి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, ప్రీతి జింతా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తదితరులు అటెండ్ అయ్యి సందడి చేశారు. తన పాత స్నేహితులందర్నీ మళ్ళీ ఒక చోట కలిసిన ప్రీతి జింతా.. అందిరితో సెల్ఫీ దిగి తన ఆనందాన్ని తెలియజేస్తూ ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో కూడా సెల్ఫీ దిగి పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

RRR : ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టారు.. 8 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాను.. RRR యూనిట్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఇక రామ్ చరణ్, ప్రియాంక చోప్రా గతంలో జంజీర్ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి మంచి స్నేహం ఉండడంతో.. చరణ్, ఉపాసనలతో కలిసి ప్రియాంక స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను ఉపాసన షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ లో దిగిన ఫోటోలు అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)