మేనకోడలితో మేకప్.. క్యూట్ కిరీటంతో మెరిసిన ప్రియాంకచోప్రా

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 02:43 AM IST
మేనకోడలితో మేకప్.. క్యూట్ కిరీటంతో మెరిసిన ప్రియాంకచోప్రా

ఇరవై ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా క్యూట్ కిరీటంతో ప్రిన్సెస్‌గా కనిపించింది. 2000 సంవత్సరంలో లండన్‌లోని మిలీనియం డోమ్‌లో ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని దక్కించుకుంది. ఇప్పుడు లాస్‌ ఏంజెలిస్‌లోని తన ఇంటి క్వారెంటైన్‌లో 37ఏళ్ల వయస్సులో ప్రియాంకా ‘ప్రెట్టీ ప్రెట్టీ ప్రిన్సెస్‌’ టైటిల్‌తో మెరిసిపోతోంది. ప్రియాంక చోప్రా ‘మెట్ గాలా’ కంటే కాస్తా భిన్నంగా ఈ ఏడాది కనిపించింది. 

కరోనావైరస్ కారణంగా ‘మెట్ యానివల్ కార్యక్రమం’ అక్టోబర్ 29 వరకు వాయిదా పడింది. అయినప్పటికీ 37 ఏళ్ల ప్రియాంకా.. తన మేనకోడలు ఆరేళ్ల చిన్నారి కృష్ణ.. పాప చేతులు మీదుగా క్యూట్ కిరీటం దక్కించుకుంది ప్రియాంక. అంతేకాదు.. ప్రియాంక కనురెప్పలపై ఐ-షాడో దిద్దింది. ప్రియాంక తల దువ్వి చక్కగా అలంకరించింది. ఈ ఏడాదిలో మెట్ గాలాను అంగీకరించిన ఏకైక సెలబ్రేట్ చోప్రా మాత్రమే కాదు. జారెడ్ లెటో 2019 లుక్‌ను రీ క్రియేట్ చేయడం ద్వారా ఈ వేడుకను మిండీ కాలింగ్ జరుపుకున్నారు. 
priyanka

#MetGalaChallengeను ప్రారంభించేలా మెట్స్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్  ప్రియాంక అభిమానులను ప్రోత్సహించింది. అభిమానులను ఇంటి నుంచే గత ‘మెట్ గాలా’
రెడ్ కార్పెట్ రూపాన్ని రీక్రియేట్ చేయడానికి ఆహ్వానించింది. తన మేనకోడలు తలపై పెట్టిన ఆ ప్రెట్టీ కిరీటం చూసి ప్రియాంక ఎంతో మురిసిపోయింది. తనకు మేకప్ వేసి అందంగా అలంకరించిన మేన కోడలిని మెచ్చుకుంది. దీనికి సంబంధించి క్యూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసుకున్నారు. 
priyanaka chopra