Proning : ఆక్సిజన్ అందడం లేదా, ప్రోనింగ్ అంటే ఏమిటీ ?..ఆక్సిజన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది

.ఇంట్లోనే ఉండి ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని, ఇళ్లలోనే ప్రోనింగ్ చేయడం మంచిది అని యూనియన్ హెల్త్ మినిస్టరీ వెల్లడించింది.

Proning : ఆక్సిజన్ అందడం లేదా, ప్రోనింగ్ అంటే ఏమిటీ ?..ఆక్సిజన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది

Proning

Breathing Troubles : ప్రస్తుతం ఎక్కడ చూసినా..కరోనా కరోనా. చాలా మంది ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ప్రధానంగా ఆక్సిజన్ దొరక్కపోతుండడంతో విగతజీవులుగా మారిపోతున్నారు. అయితే..ఇంట్లోనే ఉండి ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని, ఇళ్లలోనే ప్రోనింగ్ చేయడం మంచిది అని యూనియన్ హెల్త్ మినిస్టరీ వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఓ డ్యాక్యుమెంట్ ను పోస్టు చేసింది. ఆక్సిజన్ లెవల్స్ సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవడం మంచిందని తెలిపింది. పోస్టులో పలు చిత్రాలు కూడా పొందుపరిచారు.




ముఖాన్ని కిందకు ఉంచి పడుకోవడాన్ని ప్రోనింగ్ అంటారని, ఇలా ఈ పొజిషన్ లో ఉండడం వల్ల కంఫర్ట్ గా ఉంటుందని తెలిపింది. అంతేగాకుండా..ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవుతుందని హెల్త్ మినిస్టరీ చెప్పింది. ఆక్సిజన్ లెవల్స్ 94 శాతం కంటే తక్కువ ఉన్న వాళ్లు ఇలా పడుకుని చేయడం వల్ల వెంటిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది.

ప్రోనింగ్ కోసం :

ఐదు తలగడలు కావాలి. ఒకటి మెడ కింద, ఒకటి లేదా రెండు చెస్ట్ కింద, తొడలకు సపోర్టుగా మరో రెండు..అవసరమైతే మరొకటి ఉపయోగించుకోవచ్చు. ఇలా 30 నిమిషాలకు ఒకసారి పోజిషన్ మార్చాలి. అందులో చూపించిన విధంగా పొజిషన్ మార్చుకోవచ్చు.




అయితే..కొంతమంది మాత్రమే ప్రోనింగ్ చేయవచ్చని వెల్లడించింది. గర్భిణీలు, కార్డియాక్ కండిషన్స్ తీవ్రంగా ఉండేవాళ్లు, స్పెయిన్ అన్ స్టేబుల్ గా ఉండే వాళ్లు, ప్రాక్చర్స్ ఉన్న వారు చేయకూడదని తెలిపింది. అలాగే..తిన్న తర్వాత చేయకూడదని, తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చేయకూడదని వెల్లడించింది.


Read More : Patna’s Oxygen Man : ఆక్సిజన్ మ్యాన్, వందల మంది ప్రాణాలను రక్షిస్తున్నాడు