PS-2: యూఎస్‌లో రిలీజ్‌కు ముందే దుమ్ములేపుతోన్న PS2..!
తమిళ ఎపిక్ మూవీ పొన్నియిన్ సెల్వన్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు పట్టం కడుతున్నట్లుగా ప్రీసేల్స్ చూస్తే అర్థమవుతోంది.

PS-2 Gets Massive Start At US Box-Office Before Release
PS-2 Movie: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్-2 ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి భారీ అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను PS-1కి సీక్వెల్‌గా మణిరత్నం తెరకెక్కించడంతో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడటం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
PS2 Movie Trailer: పొన్నియిన్ సెల్వన్-2 ట్రైలర్ రిలీజ్‌కు గెస్ట్‌గా లోకనాయకుడు..?
ఇక తొలి భాగం కంటే కూడా ఎక్కువ డ్రామా, రివెంజ్ ఈ సీక్వెల్ మూవీలో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-సేల్స్ స్టార్ట్ కావడంతో, యూఎస్ బాక్సాఫీస్ వద్ద PS-2 మూవీ దుమ్ములేపుతోంది.
PS-2 Movie: ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్-2
కేవలం ప్రీసేల్స్‌తోనే ఈ సినిమా అక్కడ ప్రభంజనం సృష్టిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే, ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200K డాలర్స్ వసూళ్లు ప్రీ-సేల్స్ రూపంలో లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి మరిన్ని ప్రీ-సేల్స్ టికెట్స్ తెగుతాయని.. దీంతో అక్కడ ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్ ఇవ్వనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి మున్ముందు రోజుల్లో ఈ సినిమా అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.