Punjab CM: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం

గతంలో ఆయనకు ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆరేళ్లక్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాజీ భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.

Punjab CM: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం

Punjab CM : పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మన్ గురువారం పెళ్లి చేసుకోబోతున్నారు. ఇది ఆయనకు రెండో పెళ్లి కావడం విశేషం. గతంలో ఆయనకు ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆరేళ్లక్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాజీ భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. గత మార్చిలో జరిగిన భగవంత్ మన్ ప్రమాణ స్వీకారానికి పిల్లలు హాజరయ్యారు. తాజాగా భగవంత్ మన్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు.

LPG price: పెరిగిన సిలిండర్ ధరలపై బీజేపీ ఎంపీ విమర్శలు

డా.గురుప్రీత్ కౌర్ అనే మహిళను ఆయన వివాహం చేసుకుంటున్నారు. ఇది భగవంత్ మన్ తల్లి, సోదరి కుదిర్చిన వివాహం. చండీఘడ్‌లో, అత్యంత దగ్గరి ఆత్మీయుల మధ్యే ఈ వివాహం జరగబోతుంది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ వివాహానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.