Pushpa: బన్నీ మేనియా.. కేరళలో స్పెషల్ షోస్ బుకింగ్ స్టార్ట్!

కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మేనియా దుమ్ము దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.

Pushpa: బన్నీ మేనియా.. కేరళలో స్పెషల్ షోస్ బుకింగ్ స్టార్ట్!

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మేనియా దుమ్ము దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంకా.. ఈ ప్రచారం పీక్స్ కి చేరనుంది.

Payal Rajput: సొగసు చూడతరమా.. పాయల్ అందాన్ని పొగడతరమా!

అల్లు అర్జున్ కెరీర్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే తొలి సినిమా ఇదే కాగా.. ఇందులో కోసం మేకర్స్ ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే మలయాళం నుండి కూడా స్టార్ నటులను ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. నార్మల్ గానే బన్నీకి కేరళలో అభిమానులెక్కువ. దీనికి తోడు ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ యాక్టర్ కూడా తోడవడంతో కేరళలో సినిమా విడుదలకి నెల రోజుల ముందే సందడి మొదలైంది.

Bollywood Film Releases: వారానికో సినిమా.. కాస్కో అంటోంది బాలీవుడ్!

కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40 థియేటర్లలో స్పెషల్ షో కోసం అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ మొదలు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 17వ తేదికి స్పెషల్ కోసం 100కి పైగా థియేటర్లు సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, ఫాహద్ ఫజిల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.