Rajamouli : పేర్ని నాని అలా.. రాజమౌళి ఇలా.. ఇంతకీ ఎందుకు కలిసినట్టో??

ఈ మీటింగ్ అనంతరం పేర్ని నాని అసలు సినిమా గురించే మాట్లాడలేదు అన్నారు. రాజమౌళి ఏమో కేవలం సినిమా గురించే మాట్లాడామని అన్నారు. మరి వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ గా మాట్లాడారో వారికే.......

Rajamouli : పేర్ని నాని అలా.. రాజమౌళి ఇలా.. ఇంతకీ ఎందుకు కలిసినట్టో??

Rajamouli

 

Rajamouli :  సినిమా టికెట్ రేట్లు పెంచిన జీవో వచ్చిన తర్వాత మొదటిసారి ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, దానయ్య నిన్న జగన్ ని కలిశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉంది కనుక మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వమని అడిగేందుకు వెళ్లినట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన మీటింగ్ లో రాజమౌళి, దానయ్య.. ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నాని ని కలిశారు.

అయితే ఈ మీటింగ్ అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. ”కొత్త జీవో వచ్చిన తర్వాత సీఎంని కలిసి థ్యాంక్స్ చెప్పేందుకు రాజమౌళి, డి.వి.వి.దానయ్య వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఎలాంటి చర్చ జరగలేదు. అన్ని పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం ఉంది. సినిమా రిలీజ్ అయినప్పుడల్లా సినిమా పరిశ్రమ వాళ్ళు ఎందుకు కలుస్తారు” అంటూ తెలిపారు.

Rajamouli : కాసేపట్లో జగన్‌ని కలవనున్న రాజమౌళి, దానయ్య.. ఈ మీటింగ్ ఎందుకో??

అయితే దీనికి భిన్నంగా రాజమౌళి తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ”సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడాము. ఈ సినిమా బాగా ఖర్చుతో కూడిన సినిమా కాబట్టి ఆ సినిమాకి ఏమిచేయలో అది చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు” అని తెలిపారు. అంటే ఇండైరెక్ట్ గా సినిమాకి టికెట్ రేట్లు పెంచమని కోరారని తెలుస్తుంది.

Perni Nani: ‘రాజమౌళి, దానయ్యలు ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడలేదు’

అయితే ఇప్పుడు వీరిద్దరి మాటలు వైరల్ అవుతున్నాయి. పేర్ని నాని అసలు సినిమా గురించే మాట్లాడలేదు అన్నారు. రాజమౌళి ఏమో కేవలం సినిమా గురించే మాట్లాడామని అన్నారు. మరి వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ గా మాట్లాడారో వారికే తెలియాలి. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో సినిమా గురించే కలిశారని అందరికి తెలిసిపోతుంది. కానీ ఇలా పేర్ని నాని మాట్లాడటంతో ఇప్పటికే సినీ పరిశ్రమ, థియేటర్ల మీద వాళ్ళు చేసిన పనుల వల్ల వారిపై నెగిటివిటీ ఏర్పడింది. ఇప్పుడు మీడియాతో ఇలా ఇద్దరు వేరు వేరు మాట్లాడటంతో మరోసారి అబద్దాలు ఎందుకు అంటూ వ్యతిరేకత వస్తుంది.