Raju : ముగిసిన రాజు అంత్యక్రియలు.. ఆత్మహత్యగానే నిర్ధారణ

సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు రాజు మృతిపై స్పష్టత వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టును బట్టి చూస్తే రాజుది ఆత్మహత్యగానే తెలుస్తోంది.

Raju : ముగిసిన రాజు అంత్యక్రియలు.. ఆత్మహత్యగానే నిర్ధారణ

Raju

Raju : సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి , హత్యకు పాల్పడిన నిందితుడు రాజు మృతిపై స్పష్టత వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టును బట్టి చూస్తే రాజుది ఆత్మహత్యగానే తెలుస్తోంది. ఇక ఆత్మహత్య చేసుకున్న రాజు మృతదేహాన్ని అతడి చేతిపై ఉన్న పేర్ల ఆధారంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Read More : T.Congress : గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా

మృతదేహం రాజుదే అని కుటుంబ సభ్యులు ధ్రువీకరించిన తర్వాత వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గంటపాటు పోస్టుమార్టం చేశారు.. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లకుండా వరంగల్ లోని పోతన కాలనీ శ్మశాన వాటికలో బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. తల్లి చితికి నిప్పంటించారు. పోస్టుమార్టానికి ముందు రాజు మృతదేహాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు చూపించారు అనంతరం పోస్టుమార్టంకి తీసుకెళ్లారు.

Read More : ZPTC MPTC Results : 19న పరిషత్‌ కౌంటింగ్‌.. అదే రోజు ఫలితాలు

ఇక రాజుకు పోస్టుమార్టం నిర్వహించిన రజా మాలిక్, ఫోరెన్సిక్ వైద్యుడు, వరంగల్ ఎంజీఎం రాజు మీడియాతో మాట్లాడారు. గంటపాటు పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. రాజు మృతదేహంపై ట్రైన్ తగిలిన గాయాలు గ్రీజు ఉన్నట్లు, రైల్వే ప్రమాదం గాయాలను గుర్తించినట్లు తెలిపారు. మృతదేహంపై ఇతర గాయాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించినట్లు వివరించారు.