RC15 : పవన్ టైటిల్ పై కన్నేసిన చరణ్.. RC15 టైటిల్ CEO కాదట!

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ‘RC15’. కాగా ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చాలా పేరులు వినిపిస్తూనే వచ్చాయి. తాజాగా ఒక రెండు పేరులు ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో మొదటిది ‘CEO’ అనే టైటిల్. దీంతో పాటు మరో టైటిల్..

RC15 : పవన్ టైటిల్ పై కన్నేసిన చరణ్.. RC15 టైటిల్ CEO కాదట!

ram charan RC15 titled as senani not ceo

RC15 : తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ‘RC15’. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకి మరో తమిళ స్టార్ డైరెక్ట్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. రామ్ చరణ్ RRR వంటి సక్సెస్ అందుకోవడం, ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ఈ సినిమా కోసం కలిసి పని చేయడంతో.. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా దర్శకనిర్మాతలను అప్డేట్ అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు.

Ram Charan – NTR : ఆ విషయంలో చరణ్, ఎన్టీఆర్‌ని ఫాలో అవుతున్నాడు అంటున్న నెటిజెన్లు..

కాగా ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చాలా పేరులు వినిపిస్తూనే వచ్చాయి. తాజాగా ఒక రెండు పేరులు ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో మొదటిది ‘CEO’ అనే టైటిల్. CEO అంటే ‘చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్’ అని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక దీంతో పాటు మరో టైటిల్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అదే పవన్ కళ్యాణ్ టైటిల్. అయితే అది పవన్ సినిమా టైటిల్ కాదు, పవన్ రాజకీయ టైటిల్. పవన్ ని రాజకీయపరంగా ‘సేనాని’ అని పిలవడం అందరికి తెలుసు.

ఇప్పుడు ఆ టైటిల్ నే ఈ సినిమాకి అనుకుంటున్నారట. సేనాని, సైనికుడు అనే రెండు టైటిల్స్ అనుకోగా, మూవీ టీంలోని ఎక్కువ మంది సేనాని టైటిల్ కి ఓటు వేశారట. దీంతో ఈ సినిమాకి సేనాని టైటిల్ ని కన్‌ఫార్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఏ టైటిల్ ని దర్శకుడు శంకర్ ఖరారు చేశాడు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.