Upasana : మాకు పుట్టబోయే పిల్లల్ని అలానే పెంచుతాం.. ఉపాసన!

దాదాపు దశాబ్ద కాలం పెళ్లి జీవితం తరువాత రామ్ చరణ్ అండ్ ఉపాసన తమ మొదటి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే వారసుడు కూడా సినీ పరిశ్రమలో చిరు, చరణ్ ల శిఖరాలను అందుకోవడం చూడాలి అంటూ మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తమకి పుట్టబోయే బిడ్డని..

Upasana : మాకు పుట్టబోయే పిల్లల్ని అలానే పెంచుతాం.. ఉపాసన!

ram charan wife Upasana

Upasana : దాదాపు దశాబ్ద కాలం పెళ్లి జీవితం తరువాత రామ్ చరణ్ అండ్ ఉపాసన తమ మొదటి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే వారసుడు కూడా సినీ పరిశ్రమలో చిరు, చరణ్ ల శిఖరాలను అందుకోవడం చూడాలి అంటూ మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తమకి పుట్టబోయే బిడ్డని ఎలా పెంచాలి అనుకుంటున్నారో ఉపాసన అభిమానులకు తెలియజేసింది.

Ram Charan : రామ్‌చరణ్‌కి మరో అరుదైన గౌరవం.. పాపులర్ అమెరికన్ షోకి గెస్ట్‌గా!

“నేను డైమండ్ సిల్వర్ స్పూన్ లో పుట్టాను అని అందరూ కామెంట్ చేస్తారు. అయితే నేను ఆ జీవితాన్ని కావాలని ఎంచుకోలేదు. కానీ నేను డైమండ్ సిల్వర్ స్పూన్ తో పుట్టడానికి నా పేరెంట్స్ ఎంత కష్ట పడ్డారో నాకు తెలుసు. నాకు ఇప్పుడు పని చేయవల్సిన అవసరం లేదు, కానీ మా పేరెంట్స్ కష్టం విలువ తెలిసింది కాబట్టి.. వారిలా నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని అనుకున్నాను. ప్రతి ఒక్కరి పుట్టకు ఒక కారణం ఉంటుంది. అలాగే గొప్ప కుటుంబంలో పుట్టిన నేను.. చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించకపోతే నా జీవితానికి అర్ధం ఉండదు. నాకు, చరణ్ కి పుట్టబోయే పిల్లల్ని కూడా మేము అలానే పెంచుతాం” అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేసింది.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. మార్చి 13న ఆస్కార్ అవార్డులు వేడుక జరగనుండగా, అందులో పాల్గొనేందుకు చరణ్ ఇటీవలే అమెరికా వెళ్ళాడు. అయితే అంతకంటే ముందు ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ కి హాజరు కానున్నాడు. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ ప్రజెంటర్ గా వెళుతున్నాడు. ఈ అవార్డ్స్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరోగా చరణ్ రికార్డ్ సృష్టించాడు.